Pages

నడుంనొప్పికి చక్కని పరిష్కారాలు ...!


వెన్నెముక దిగువభాగంలో కలిగే నొప్పిని ఆయుర్వేదంలో కటివాతం(జూఠఝఛ్చజౌ) అనీ, కాలు తుంటి భాగంలో నుండి పాదం వరకూ నలిగే నొప్పిని గృధ్రసీవాతం(టఛిజ్చ్టీజీఛ్చి)పిలుస్తారు. సాధారణంగా కటి, గృధ్రసీవాతం కలిసి ఒకేసారి వస్తుంటాయి.
వెన్నెముక మెలిక తిరగడం వల్లగాని, బరువైన వస్తువులు ఎత్తడం వల్ల గానీ , వెన్నుపూసకు, వెన్నుపూసకు మధ్యగల గుండ్రని పళ్లెంలాంటి భాగం, వాత ప్రకోపం వల్ల దాని ముందుకు పొడుచుకు వచ్చి నడుం నొప్పిలుగుతుంది. వాత కఫాలు ప్రకోపించడం వల్ల కాళ్లు, వెనుకభాగంలో పొడవునా వ్యాపించి ఉన్న గృధ్రసేనాడిపై ఒత్తిడి పడటం వల్ల , ఆ నాడి కాని, దాని తొడుగుకానీ వాచి సయాటికా నొప్పి వస్తుంది.
కటివాత, గృధ్రసీవాతం లక్షణాలు
సాధారణంగా వంగినపుడు వెన్ను దిగువభాగంలో తీవ్రమైన నొప్పి హఠాత్తుగా మొదలై నిటారుగా నిలబడనివ్వదు. ఇదే కటివాత ప్రధాన లక్షణం. గృధ్రసీవాతం పిరుదుల్లో మొదలై కాళ్లు, తొడలు, పిక్కలు పొడవునా పాదం బొటనవేలు వరకూ పాకుతూ విపరీతమైన బాధను కరిగిస్తుంది. కొద్దిసేపు కూడా కాలు మడిచి కూర్చోనివ్వదు. కాలు పొడవునా తిమ్మిరి ఉంటుంది. తొడ, పాదం పైభాగాల్లో స్పర్శ ఉండదు. నడుంనొప్పి, గృధ్రసీవాతంల ను అదుపుచేయటానికి మన ఇంట్లోని పెరటిమొక్కలను ఉపయోగించి వైద్యం చేసుకోవచ్చో తెల్సుకుందాం.
వెల్లుల్లి మిశ్రమం
కావాల్సిన పదార్థాలు- 20 వెల్లుల్లి రేకులు, నువ్వులనూనె
తయారీవిధానం- 20 వెల్లుల్లి రేకులు, 100 గ్రాముల నువ్వులనూనెలో బాగా మాడ్చి తైలం తయారు చేసుకోవాలి. రోజూ ఉదయం ఆ తైలాన్ని నొప్పి ఉన్నచోట మర్ధన చేస్తుంటే కటి, గృధ్రసీవాతాలు త్వరగా తగ్గుతాయి.
కరక్కాయ మిశ్రమం
కావాల్సిన పదార్థాలు- కరక్కాయలు
తయారీ విధానం- 2 గ్రాముల కరక్కాయలతో చూర్ణాన్ని తయారు చేసుకోవాలి. రోజూ భోజనం తర్వాత మంచినీళ్లతో కలిపి తాగాలి. నొప్పులు తగ్గుతాయి.
బంగాళదుంప మిశ్రమం
కావాల్సిన పదార్థాలు- బంగాళదుంప
తయారీ విధానం- బంగాళదుంపను(ఆలుగడ్డ) పచ్చిగా ఉండగానే మెత్తగా నూరి వెన్నుపైన నొప్పిగల చోట పట్టీగా వేస్తే నొప్పితగ్గుతుంది.
నిమ్మరసం
కావాల్సిన పదార్థాలు - నిమ్మరసం, వంటసోడా, ఉప్పు
తయారీ విధానం- ఒక చెంచాడు నిమ్మరసంలో కొద్దిగా తినేసోడా(వంటసోడా)ని ఉప్పుతో కలిపి తీసుకుంటే వెన్నునొప్పి తగ్గుతుంది.
సొంటిమిశ్రమం
కావాల్సిన పదార్థాలు- సొంటి, నెయ్యి, వెల్లుల్లి
తయారీ విధానం- సొంటిని కొద్దిగా నెయ్యిలో వేయించి పొడిచేసి సమంగా వెల్లుల్లిని నెయ్యిని కలిపి నూరి ఒక చెంచాడు ఉదయం, రాత్రి భోజనం తర్వాత తినాలి. కటి, గృధ్రసీవాతాలు తగ్గుతాయి.
తులసి మిశ్రమం
కావాల్సిన పదార్థాలు- తులసి, మిర్యాలు, నెయ్యి
తయారీ విధానం- రోజూ ఉదయం, రాత్రి తులసి రసం, మిర్యాలపొడి, నెయ్యి సమంగా కలిపి ఒక టేబుల్‌ స్పూన్‌ చొప్పున తీసుకోవాలి.
బియ్యం పిండి మిశ్రమం
కావాల్సిన పదార్థాలు- బియ్యం, ఉమ్మెత్తాకులు, నీళ్లు
తయారీవిధానం- బియ్యంపిండికి సమంగా ఉమ్మెత్తాకులు కలిసి నీటిలో నూరి నొప్పిగల చోట పట్టీ వేయాలి.
వేప మిశ్రమం
కావాల్సిన పదార్థాలు- వేప వేరు, నీళ్లు
తయారీ విధానం- 10 గ్రాముల వేప వేరు బెరడును నీటిలో నూరాలి. తర్వాత మంచినీటిలో కలిపి ఉదయాన్నే తాగాలి.
ఆముదం గింజల మిశ్రమం
కావాల్సిన పదార్థాలు- ఆముదం గింజలు, సొంటి, పంచదార
తయారీ విధానం- ఆముదగింజల్లోని పప్పు , సొంటి, పంచదారను సమపాళ్లలో తీసుకుని కుంకుడు గింజలంత మాత్రలు చేసి రోజూ పాలతో వాడితే చాలా మంచిది.
పసుపు మిశ్రమం
కావాల్సిన పదార్థాలు- పసుపు, నువ్వుల నూనె

తయారీ విధానం- నొప్పిగల చోట నువ్వలనూనెతో మర్ధన చేసి, 15 నిమిషాల తర్వాత పసుపుతో దానిపై నలుగు పెడితే నొప్పులు తగ్గిపోతాయి.