Pages

డయాబెటిస్‌ - ఈ వ్యాధి మీ శరీరాన్ని కబళిస్తుంది జాగ్రత్త ?


యాబెటిస్‌ ఇక దూరం

దేశంలో ప్రతి వందమందిలో 14 మంది డయాబెటిస్‌ బారిన పడుతున్నారు. ఈ వ్యాధి ఉన్నవారు జీవితాంతం సమస్య అని భావించనక్కరలేదు. ప్రపంచ ప్రామాణికమైన ఆయుర్వేద వైద్యంతో డయాబెటిస్‌ సమస్యను పరిష్కరించవచ్చంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణురాలు డాక్టర్‌ లక్ష్మీ.
డయాబెటిస్‌ వ్యాధితో పలు దుష్ఫలితాలున్నాయి. విపరీతంగా దాహం వేయడం, మూత్రవిసర్జన పెరగటం, ఎక్కువ ఆకలి వేయటం, ఎంత ఆహారం తీసుకున్నా బలహీనంగా ఉండటం, బరువు తగ్గిపోవటం, నీరసం, నిస్సత్తువ, చూపు మందగించటం, కళ్లు మసకగా కనిపించటం, అలసట, కాళ్లు లాగటం లాంటి సమస్యలు ఏర్పడుతాయి. గాయమైతే త్వరగా తగ్గక పోవటం, కొన్ని సంవత్సరాల తర్వాత శరీరంలో రక్తనాళాలు దెబ్బతినటం వల్ల గుండె, మెదడు, కాళ్లు, చేతుల్లోని రక్తనాళాలు దెబ్బతింటాయి. చిన్న రక్తనాళాలు దెబ్బతిన్నందువల్ల కంట్లోని రెటీనా దెబ్బతింటుంది. నరాల బలహీనత, కళ్లమంటలు, మానసిక, సెక్స్‌ సమస్యలు ఏర్పడుతుంటాయి. ఈ సమస్యకు నిత్యం వాడే షుగర్‌ వ్యాధి నిరోధక మందుల వల్ల చర్మంపై మచ్చలు ఏర్పడటం, తలనొప్పి, జీర్ణ సంబంధిత సమస్యలు కలుగుతాయి. డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోకపోతే మెల్లిమెల్లిగా ఈ వ్యాధి మీ శరీరాన్ని కబళిస్తుంది.
ఆయుర్వేద వైద్యం : డయాబెటిస్‌ సమస్యకు ప్రకృతిలో ఉన్న వనమూలికలతో తయారు చేసిన ఆయుర్వేద మందులు అందుబాటులోకి వచ్చాయి.ఎన్ని సంవత్సరాల నుంచి వ్యాధి ఉంది? అనువంశికమా లేదా మానసిక ఒత్తిళ్ల వల్ల వచ్చిందా? రోగ లక్షణాలను పరిశీలించి ఆయుర్వేద మందులు ఇస్తారు. అత్యాధునిక ఫార్ములాతో కూడిన మందుల వల్ల కొత్త జీవితం ఖాయం. డయాబెటిస్‌ను వ్యాఽధిగా భావించకుండా జీవిత విధానం మార్పులతోనే దీన్ని అదుపులో ఉంచవచ్చు. ప్రీ డయాబెటిస్‌ ఉన్న రోగులకు పూర్తిగా తగ్గించవచ్చు. ఆయుర్వేద మందులతో పాటు పీచుపదార్ధాలు అధికంగా తీసుకోవటం, ఉప్పు, చక్కెర తగ్గించటం, మితమైన పౌష్టికాహారం తీసుకోవటం, వ్యాయామం చేయడం ద్వారా డయాబెటిస్‌ను శాశ్వతంగా అదుపు చేయవచ్చు.