మెడనొప్పిని అశ్రద్ధ చేయకండి ?


మెడనొప్పి తీవ్రమైపోయి అవి ఇతర ఆరోగ్యసమస్యలకు దారి తీయవచ్చు. మెడనొప్పి తీవ్రత వల్ల మూత్రాశయంలో మార్పులు వచ్చే అవకాశం ఎక్కువ. నొప్పి ఎక్కువైన కొద్దీ నరాల మీద వత్తిడి పెరిగి అటు తర్వాత మూత్ర విసర్జనలో తేడాలు వచ్చి ఇతర ఆరోగ్య సమస్యలు దారితేసే అవకాశం ఉంది. మనం నిల్చునే, కూర్చునే భంగిమలు సరిగ్గా లేకపోవడం కారణంగానే మెడ నొప్పి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఒక్కోసారి వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్క్‌ వల్ల కూడా విపరీతమైన సమస్యలు వస్తాయి. ఈ డిస్క్‌ జారి నరాల మీద ఒత్తిడి కలిగినపుడు నొప్పి వస్తుంటుంది. వెన్నుపూసలో నుంచి మెదడు లోకి వెళ్లే రెండు రక్తనాళాలైన వర్టిబ్రల్‌ ఆర్టరీస్‌ చిన్న మెదడుకు రక్తప్రసరణ అందిస్తాయి. నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు ఈ ఆర్టరీస్‌ రక్త ప్రసారంలో తేడాలు వచ్చి మెదడుకు రక్తప్రసారం అంతగా ఉండదు. దీని మూలంగా నొప్పితో పాటు తలతిరగడం, దిమ్ముగా అనిపించడం, వాంతులు 
అవుతుంటాయి. మెడదగ్గర ఉండే వెన్నుముకలో ఏడు వెన్నుపూసలు ఉంటాయి. వాటిలో మొదటి వెన్నుపూసను అట్లాస్‌ అని. రెండవ వెన్నుపూసను, ఆక్సిస్‌ అని అంటారు. ఆ తర్వాత పూసలను సర్వెకల్‌ 3,4,5,6,7 అంటారు. ఇవన్నీ ఒకదానికొకటి జాయింట్స్‌గా అమర్చి ఉంటాయి. వీటిలో సై్పనల్‌ కెనాల్‌ ఉంటుంది. దాని ద్వారా సై్పనల్‌ కార్డ్‌ అంటే వెన్నుపాము మెదడు నుంచి కాళ్లకు, చేతులకు నరాలకు తీసుెళుతుంది. ఒక వెన్నుపూసకు, మరొక వెన్నుపూసకు మధ్యలో ఉండే ఇంటర్‌ వర్టిబ్రల్‌ పారామినా నుండి ఒక్కొక నరం బైటకు వస్తుంది. ఈ నరాలు ఒక్కోవైపునకు విస్తరించి ఉంటాయి. వెన్నుపూసల మధ్యలో ఉండి దిస్క్‌ షాక్‌ అబ్జార్బర్‌లా పనిచేస్తుంది. డిస్క్‌కి రక్తప్రసరణ అవసరం ఉండదు. మనం తీసుకున్న ఆహారం ద్వా రానే దీనికి పోషకాలు అందుతాయి. శరీరబరువు, తలబరువును బ్యాలెన్స్‌ చేయడానికి ఇది దోహదపడుతుంది.

ఎక్సరే- స్కానింగ్‌ : 
మెడనొప్పి వచ్చే వారికి ఎక్సరే తీస్తే సమస్య తీవ్రత ఎంత ఉందో తెలుకోవచ్చు. ఎక్స్‌రేను బట్టి మెడపూసలలో ఏమైన తేడాలు ఉన్నాయా అనేది తెలుసుకొని దీనిని బట్టి చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది. దీని వలన పుట్టుకతోనే వెన్నుపూసలో సమస్యలు ఉన్నాయా? మధ్యలో ఏమైన వచ్చి చేరాయా? అనేది తెలుసుకోవడానికి వీలవుతుంది. ఇంకా సూక్ష్మమైన సమస్యలు ఉన్నావారికి ఎం.ఆర్‌.ఐ స్కాన్‌ ద్వారా పరిక్షలు నిర్మహించి దీని ద్వారా ఏ నరం మీద ఎంతఒత్తిడి ఉందో తెలుసుకొని ఆ వత్తిడి దేని వల్ల నచ్చింది? ఏదైనా ఎము ఫ్రాక్చర్‌ అయిందా? నరాల్లో వాపు ఏమైనా ఉందా? గడ్డలు ఉన్నాయా? ఇవన్నీ ఎం.ఆర్‌.ఐ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. డిస్క్‌ ప్రొలాప్స్‌ (డిస్క్‌ తాను ఉండే స్థానం నుంచి తొలగడం) ఉంటే ఎంత మేరకు ఆ సమస్య ఉందో గమనించి దానిని చికిత్స చేస్తారు.

పర్సనల్‌ కేర్‌: 
మెడ నొప్పి వచ్చినప్పుడు వేడినీళ్లలో మెత్తటి వస్త్రాన్ని ముంచి, పిండి మెడపైన కాపడం లేదా ఐస్‌ముక్కను క్లాత్‌లో చుట్టి దానితో కాపడం పెడితే సాధరణ నొప్పి నుంచి రిలీఫ్‌ లభిస్తుంది. మెడ కండరాలలో నొప్పి ఉన్నపుడు తప్పనిసరిగా వాటికి విశ్రాంతి ఇవ్వాలి. ఎందుకంటే కండరాలు బిగుసుకుపోయి ఉంటాయి. అందుకని నొప్పి ఉన్నపుడు పనులు చేయకుండా విశ్రాంతి తీసుకోవాలి. లేదంటే నొప్పి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఫిజియోథెరపిస్ట్‌ని కలిసి కండరాల విశ్రాంతి కోసం నెక్‌ ఎక్సర్‌సైజ్‌లను చేస్తే నొప్పి త్వరగా తగ్గే అవకాశం ఉంది. సాధారణ నొప్పి అయితే పెయిన్‌కిల్లర్‌ అయిం ట్‌ మెంట్లు ఉంటాయి. వీటితో రోజుకి ఐదారు సార్లు సున్నితంగా మసాజ్‌ చేస్తే నొప్పి నుంచి రిలీఫ్‌ ఉంటుంది. బరువైన బ్యాగులను ఒక భుజానికే వేసుకొని నడవడం వల్ల మెడ కండరాలపై ఒత్తిడి పెరిగి నొప్పి వస్తుంది. అలాగే నడిచేటపుడు ఒకవైపుకే వంగడం సరికాదు.