మీరు మరణించబోతున్నరని తెలిపే లక్షణాలు ?



పుట్టేదెప్పుడో ముందే తెలుస్తుంది కాని చావును గురించి ముందుగా తెలియడం అరుదు. అందువల్ల విధిగా వచ్చేదైనప్పటికీ చావు అందరికీ ఒక మిస్టరీగా అనిపించడంలో ఆశ్చర్యం లేదు. దాన్ని గురించి ఎంతో జిజ్ఞాసా, భయాలూ, సందేహాలూ కలుగుతూంటాయి. శరీరం అశాశ్వతమనీ, జీవితం బుద్బుదప్రాయమనీ అనేక వైరాగ్య భావనలు మనకు ఉండనే ఉన్నాయి. అందరం ఎప్పుడో ఒకప్పుడు పోవలసిందే అనే ఆలోచన జీవితం, సమాజంపట్ల మన వైఖరిని బలంగా శాసిస్తుందనడంలో సందేహం లేదు.
చావు అనేది ఎప్పుడూ మనల్ని భయపెడుతూనే ఉంటుంది. ఇది మానవ జీవితంలో ఒక నిజమైన వాస్తవం. ఎప్పుడు జన్మిస్తారో, ఎప్పుడు మరణిస్తారో ఎవ్వరికీ తెలియదు. చావు అనివార్యమైనది. మరణం గురించి మనకు వింత విషయం ఏముంది. మనం మరణించిన తర్వాత ఏం జరుగుతుంది. మరణం తర్వాత ప్రపంచం ఉందా లేదా మరణం తర్వాత మనం కేవలం అదృశ్యమవుతామా?ఇటువంటి ప్రశ్నలతో మనం ఎప్పుడూ భయపడుతుంటాం అందుకు మానవులు ఎల్లప్పుడూ మణం నివారించడానికి ఎన్నో మార్గాలకోసం చూస్తుంటారు.
కానీ మరణం నుండి తప్పించుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. మీరు మరణించబోతున్నారన్న మీకు కూడా తెలియంత విధంగా నిశ్శద్దంగా వస్తుంది మరణం. అయితే మన ఇండియన్ గ్రంధాలలో ఒక వ్యక్తి వెంటనే లేదా త్వరలో చనిపోతాడని సూచించే కొన్ని లక్షణాలను నమోదు చేయడం జరిగింది.
మరణించబోతున్నారన్న సంకేతాలను శివ పురాణంలో వివరించడం జరిగింది. శివ పురాణం ప్రకారం, ఒక సారి పార్వతీ దేవి మరణం యొక్క సంకేతాల గురించి లార్డ్ శివను కోరినట్లు తెలుపుతున్నాయి. ఒక అతను/ఆమె చనిపోబోతున్నారని ఎలా తెలుస్తుంది?తర్వాత మరణం గురించి ప్రతిదీ పార్వతీ దేవికి వివరించాడాని శివ పురాణంలో తెలుపుతున్నది. లార్డ్ శివ పార్వతి దేవికి వివరించిన వాటిలో 10 లక్షణాలను కొద్ది రోజుల్లో లేదా కొన్ని గంటల్లో చనిపోయే వ్యక్తిలో చూడవచ్చు అని మాట్లాడం జరిగింది