ఆముదము తయారు చేసే విధానము : |
ఆముదము ఒకరకమైన నూనె చెట్టు. ఆముదము చెట్టులలో ఎరుపు, తెలుపు, పెద్దాముదము అను మూడు రకములు కలవు. తెలుపు, ఎరుపు రంగులు గల పుష్పాలను బట్టి, పెద్దవైన ఆకులను బట్టి వీటిని గుర్తించాలి. |
చిన్న ఆకులు కలిగిన చిట్టాముదపు చెట్టు
మిక్కిలి శ్రేష్ఠమైనది. ఆముదపు గింజల నుండి ఆముదము
నూనె తయారుచేస్తారు. |
ఆముదము గింజలను రోట్లోవేసి బాగా దంచగా అది ఒక ముద్ద లాగ తయారవుతుంది. దానిని ఒక పాత్రలోవేసి సగానికి పైగా నీరు పోసి పొయ్యి మీద పెట్టి బాగ మంట పెడతారు |
అప్పుడు అందులోని ఆముదపు నూనె నీటిపై ఒక తెరలాగ తేలుతుంది. దానిని ఒక పలచటి గరిటతో తీసి చిన పాత్రలో వేస్తారు. అలా నీటి పైన తేలిన నూనెను వేరుపరుస్తూ ఉడుకుతున్న ఆముదపు పిండిని మాటిమాటికి కలుపుతూ పైకి తేలిన నూనెను తీసుకుంటారు. |
చివరగా నీటి పై తేలిన నూనె (ఆముదము) గరిటలోకి రాదు. |
అప్పుడు ఒక గుప్పెడు వెంట్రుకలు తీసుకొని
నీటిపై తేలిన నూనెలో ముంచుతారు. ఆముదము మాత్రమే వెంట్రుకలకు అంటుకొని నీరు
క్రిందికి జారి పోతుంది. |
ఆ వెంట్రుకలు ఆముదము గిన్నెలో పిండి మరలా నీటిప అద్ది అక్కడ తేలిన ఆముదాన్ని సేకరిస్తారు. ఆవిధంగా మిగిలిన ఆముదాన్ని కూడ సేకరిస్తారు. నూనె సేకరించిన పాత్రలో ఆముదము తో కలిసిన నీరు కొంత పాత్ర అడుగుకు చేరి వుంటుంది. |
దానిని కూడ తీసివేసి ఆముదాన్ని మాత్రమే
ఒక పాత్రలో సేకరిస్తారు. ఇందులో కూడ అతి కొద్ది శాతం నీరు వుంటుంది. అది కూడ
పోవడానికి ఆ ఆముదాన్ని పొయ్యిపై పెట్టి బాగ వేడి చేస్తారు. |
అప్పుడు అందులోని నీరు ఆవిరైపోయి శ్వచ్చమైన ఆముదము మాత్రమే మిగులుతుంది. దీనినే వంట ఆముదముఅంటారు. దీనిని పిల్లలకు మందుగాను, వారితలలకు వాడుతారు. |
గానుగలతో తీసిన ఆముదాన్ని ఇందుకు వాడరు. ఆముదాలలో రెండు రకాలు: 1. చిట్టిఆముదాలు. 2. పెద్ద ఆముదాలు. చిట్టి ఆముదాలకు ప్రత్యేక వున్నది. |
ఆముదం వలన ఉపయోగాలు |
ఆముదపు ఆకుల రసం పచ్చకామెర్లు వ్యాధిని కొన్ని రోజులలో నయం చేస్తుందని నమ్మకం. |
చెవిపోటుకు... ఆముదపు ఆకులను నిప్పులపైన వెచ్చచేసి దంచి రసం తీసి, దానితో సమానంగా అల్లం రసం, నువ్వుల నూనె, అతి మధు రం, ఉప్పు కలిపి తైలం మిగిలేవరకు చిన్న మంట మీద మరగబెట్టి వడపోసి, ఆ నూనె చెవిలో పది చుక్కలు వేస్తే వెంటనే చెవిపోటు తగ్గిపోతుంది. |
శరీరంపై నల్ల మచ్చలకు... ఆముదపు గింజలు 225 తీసుకొని పై పెచ్చులు తీసివేసి, లోపలి పప్పులో 12 గ్రాముల శొంఠి పొడి కలిపి మెత్తగా నూరి, కుంకుడు గింజలంత మాత్రలు చేసి నిలువ ఉంచుకొని, పూటకు ఒక మాత్ర చొప్పున రెండు పూటలా మంచి నీళ్ళతో వేసుకొంటూ ఉంటే రెండు లేక మూడు నెలల్లో నల్లమచ్చలన్నీ సమసిపోతాయి. |
బోదకాళ్ళకు... ఆముదం వేళ్ళు, ఉమ్మెత్త వేళ్ళు, వావిలి చెట్టు వేళ్ళు, తెల్ల గలిజేరు వేళ్ళు, మునగ చెట్టు వేళ్ళు, ఆవాలు వీటిని సమానంగా తీసుకొని మంచి నీటితో దంచి రసాలు తీసి, ఆ రసం ఎంత ఉంటే అంత ఆముదం కలిపి, నూనె మాత్రమే మిగిలే వరకు మరగబెట్టి, వడపోసి, ఆ నూనెలో సగభాగం తేనె మైనం కలిపి ఆయింట్‌మెంట్‌లాగా తయారు చేసుకొని నిలువ ఉంచి, బోదకాల మీద లేపనం చేస్తూ ఉంటే కాలు యధాస్థితికి వచ్చే అవకాశం ఉంది. |
దగ్గుకు... ఆముదంలో తాలింపు వేసిన చామదుంపల కూర
తింటూ ఉంటే దగ్గులు తగ్గిపోతాయి. మూత్రపిండ వ్యాధులకు... మంచి ప్రశస్తమైన ఆముదాన్ని రోజూ రాత్రి పడుకోబోయే ముందు పది గ్రాముల మోతాదుగా నియమబద్ధంగా శారీరక శక్తిని బట్టి సేవిస్తూ ఉంటే మూత్రపిండాలు బాగుంటాయి. మూత్ర బంధం విడిపోతుంది. మూత్ర కోశంలోని రాళ్ళు కరిగిపోతాయి |
అరికాళ్ళ మంటలకు... ఆముదము, కొబ్బరి నూనె సమానంగా కలిపి అరికాళ్ళకు బాగా మర్దనా చేస్తూంటే, అతిత్వరగా అరికాళ మంటలు అణగిపోతాయి. |
కీళ్ళ నొప్పులకు... ఆముదము చెట్టు చిగురాకులు, ఉమ్మెత్త చిగురాకులు, జిలేే్లడు చిగురాకులు, పొగాకు చిగురాకులు వీటిని భాగాలుగా తీసుకొని మెత్తగా నూరి శనగ గింజలంత మాత్రలు చేసి గాలికి ఆరబెట్టి నిలువ ఉంచుకొని, పూటకొక మాత్ర మంచినీళ్ళతో సేవిస్తూ ఉంటే కీళ్ళ నొప్పులు హరించి పోతాయి. |
రేచీకటికి... మంచి వంటాముదాన్ని ప్రతి రోజూ క్రమం తప్పకుండా తలకు పెడుతూ ఉంటే, రెండు మూడు నెలలలో రేచీకటి తగ్గి పోతుంది. |