>> దుస్తుల మీద నూనె పడి మరకలు తయారైనప్పుడు వాటిని వెంటనే కడగకూడదు.
>> ముందుగా దానిమీద పౌడర్‌ను చల్లాలి. ఇలా చేయడం వల్ల నూనె జిడ్డు పౌడర్‌కు అంటుకుంటుంది.
>> తరువాత బ్రష్‌తో మరక పోయే వరకూ రుద్దాలి. ఆ తరువాత దానిని ఉతకాలి.
పౌడర్ బదులుగా చాక్పీస్ను పొడి చేసి చల్లవచ్చు.
చాక్‌పీస్ పొడి చల్లి, ఒక గంటసేపు అలాగే ఉంచి, ఆ తరువాత ఉతికితే మరకలు పోతాయి.
>> బట్టలకు గ్రీజ్ అంటుకున్నప్పుడు దానిపైన మొక్క జొన్న పిండిని చల్లాలి. కొంతసేపటి
తరువాత దానిని మరొక బట్టతో తుడిస్తే ఆ మరకలు పోతాయి.
>> పౌడర్ కాని, మొక్కజొన్న పొడి కాని సిద్ధంగా లేనప్పుడు న్యూస్ పేపర్ణు జిడ్డు
మరకలపై పరచి ఉంచాలి. కాగితం నూనెను పీల్చుకుంటుంది. ఆ తరువాత మరకను
ఉతికితే సరిపోతుంది.