ఈ వయసులో చార్మితో ఏంటి బ్రహ్మి ఆ సరసం....


బ్రహ్మి కోసం చిత్ర ఫలితం



వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారిని కడుపుబ్బా నవ్వించే కమెడియన్ బ్రహ్మానందం .. బ్రహ్మి డైలాగ్ చెప్పనవసరం లేదు , కేవలం తెర మీద కనపడితే చాలు ఆడియన్స్ నవ్వడం మొదలు పెడతారు.. దీన్ని దృష్టిలో పెట్టుకొని దర్శక నిర్మాతలు కూడా అదే స్థాయిలో సినిమా లో బ్రహ్మి క్యారెక్టర్ ని డిజైన్ చేయడంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. 

బ్రహ్మి క్యారెక్టర్ విషయం లో పూరి డిఫరెంట్ స్టైల్. పూరి తన ప్రతి సినిమా లో బ్రహ్మి క్యారెక్టర్ హైలైట్ అయ్యేలా చూసుకుంటాడు. తాజాగా పూరి - ఛార్మి కాంబినేషన్ లో రాబోతున్న జ్యోతి లక్ష్మి చిత్రం లోకూడా బ్రహ్మానందం క్యారెక్టర్ చాల డిఫరెంట్ గా చూపించాడట. ఇప్పటికే జ్యోతి లక్ష్మి సాంగ్ లో బ్రహ్మి , ఛార్మి కి ఏమాత్రం తక్కువ కాదు అనే విధంగా పోటి పడి స్టెప్పులేశాడట. 

అంతే కాదు వయసు తో సంబంధం లేకుండా అమ్మాయిలతో డాన్సు చేయడం, చిలిపి పనులు చేయడం వంటివి బాగా చేశాడట. ఇక ఈ చిత్రం జూన్‌ 12న వరల్డ్‌వైడ్‌గా విడుదల కాబోతుంది. ఛార్మి సరసన సత్య, వంశీ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.