మ్యాగీ నూడిల్స్‌లో మోతాదుకు మించి హానికర పదార్థాలు ఉన్నాయంటూ పలు రాష్ట్రాల్లో నిషేధం విధించిన నేపథ్యంలో తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మ్యాగీపై నిషేధం విధించింది.
తాజాగా రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్‌లో మ్యాగీకి మద్దతు తెలుపుతూ.. వివాదం మొదలైన తర్వాత మరింత ఎక్కువగా మ్యాగీ తింటున్నానని ట్వీట్ చేశారు. తిరుమల వెంకటేశ్వరస్వామి పవిత్ర ప్రసాదం తిరుపతి లడ్డూను పరీక్షించగలరా? అంటూ ప్రశ్నించి సంచలనం రేపారు. రోడ్డు పక్కగా ఉన్న వంద హోటళ్లను తనిఖీ చేయగలరా? అని కూడా ఆయన ప్రశ్నించారు. క్యూట్ గానే కాక టేస్టీగా ఉండే ‘మ్యాగీ’ వివాదం తనకు బాధ కలిగించిందని పేర్కొన్నారు.
'ఆరోగ్యానికి హాని కలిగించే సిగరెట్లు, మద్యాన్ని విచ్చలవిడిగా అమ్ముతారు.. మ్యాగీపై నిషేధం విధించారు... సూపర్' అంటూ వర్మ పేర్కొన్నారు.