ఇటీవల జరిపిన ఓ సర్వేలో ఆసక్తికర విషయం వెలుగు చూసింది. తమ భాగస్వామితో శృంగారంలో పాల్గొనే సమయంలో దాదాపు సగం శాతం మంది మహిళలు మరో వ్యక్తి గురించి ఆలోచిస్తారట.
ప్రధానంగా తాము పని చేసే కార్యాలయంలోని ఇతర మగవారి గురించి ఎక్కువమంది ఆలోచిస్తుంటారట. మగవారు కూడా అలాగే ఆలోచిస్తుంటారట.
46 శాతం మంది మహిళలు, 42 శాతం మంది పురుషులు భాగస్వామితో శృంగారం సమయంలో ఇతరుల గురించి ఊహించుకుంటారు.
సదరు పురుషులు, మహిళలు తమ మాజీ లవర్ గురించి లేదా సన్నిహితుడు లేదా ఇతర సహోద్యోగి గురించి ఊహించుకుంటారు. సర్వే ప్రకారం... దాదాపు 30 శాతం మంది మహిళలు, 25 శాతం మంది పురుషులు తమ మాజీ ప్రియుడు లేదా సన్నిహితుడిని ఊహించుకుంటారు.
సర్వే ప్రకారం... దాదాపు 26 శాతం మంది మహిళలు, 22 శాతం మంది పురుషులు తమ సహోద్యోగితో సాన్నిహిత్యం కలిగి ఉన్నారు.
సర్వే ప్రకారం... 20 శాతం మంది మహిళలు, 11 శాతం మంది పురుషులు తమ బాస్ గురించి ఊహించుకుంటుంటారు.
సర్వే ప్రకారం... 70 శాతం మంది మహిళలు, 63 శాతం పురుషులు తమ పార్ట్‌నర్ గురించి శృంగారంలో ఊహాలోకంలో తేలుతుంటారు. 62 శాతం మంది మహిళలు తాము ఊహించిన విధంగా శృంగార జీవితం ఉందని, 38 శాతం మంది లేదని చెప్పారు. 68 శాతం మంది పురుషులు బాగుందని, 32 శాతం మంది అసంతృప్తితో ఉన్నట్లు చెప్పారు.