Pages

రెండో పెళ్ళాన్ని పోషించే సత్తా నీలో ఉంటె రెండో పెళ్లి చేసుకోవచ్చు - ముంబై కోర్టు




2001లో వివాహమైన తరువాత నివాసం నిమిత్తం యూఎస్‌కు వెళ్లిన ముస్లిం జంటకు నాలుగు నుంచి 12 సంవత్సరాల వయసున్న నలుగురు పిల్లలున్నారు. 45 సంవత్సరాల వయసున్న భర్త, ఆన్ లైన్లో తనకు 18 నుంచి 25 సంవత్సరాల్లోపు వయసున్న అమ్మాయి కావాలని ఇచ్చిన ప్రకటన చూసి, తనకున్న చట్టపరమైన హక్కులకు రక్షణ కావాలని కోరుతూ, బాంద్రా ఫ్యామిలీ కోర్టును ఆ వివాహిత ఆశ్రయించింది. 
తన అనుమతి లేకుండా భర్త వివాహానికి యత్నిస్తున్నాడని, ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని ఆదేశించాడని, తన ప్రయోజనాలు చూసేంత వరకూ మరో పెళ్లి చేసుకోకుండా చూడాలని ఆమె వాదించింది. ఆమె తలాక్ చెప్పిందని, ముస్లిం వ్యక్తిగత చట్టాల ప్రకారం ఆమెకు హక్కులు వర్తించవని, తాను నాలుగు వివాహాలు చేసుకునే హక్కును కలిగివున్నానని భర్త వాదించాడు. 


ఈ కేసులో పలు రికార్డులు, ముస్లిం చట్టాలను పరిశీలించిన న్యాయమూర్తి, చాలా జాగ్రత్తలతో తీర్పు చదివారు. ముస్లిం చట్టాల ప్రకారం రెండో వివాహానికి అనుమతి ఉన్నా, రెండో వివాహంతో మొదటి భార్యకు అన్యాయం జరిగేట్టుంటే దాన్ని ఆపవచ్చని 'సురాహ్ నిసా'లో ఉందని, ఇద్దరినీ సమానంగా చూసేలా ఉండాలని, పోషించే సత్తా కూడా ఉంటేనే రెండో వివాహానికి అర్హుడని తీర్పిచ్చారు. ఆ అర్హత లేని కారణంగా ఆ వ్యక్తి రెండో వివాహాన్ని కోర్టు అడ్డుకుంది.