Pages

బాహుబలి స్టోరీ ఆన్ లైన్లో లీకైన స్టోరీ ఇలా ఉంది... 'మహిష్మతి రాజ్యానికి అధిపతి అమరేంద్ర బాహుబలి(ప్రభాస్)....


రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'బాహుబలి' చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదలై సూపర్బ్ రెస్పాన్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే షాకింగ్ విషయం ఏమిటంటే....ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీ ఆన్ లైన్లో లీకైనట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ స్టోరీ నిజమైందా? కాదా? అనేది తెలియాల్సి ఉంది. 

లీకైన స్టోరీ ఇలా ఉంది... 'మహిష్మతి రాజ్యానికి అధిపతి అమరేంద్ర బాహుబలి(ప్రభాస్). ఆయన భార్య దేవసేన(అనుష్క). వీరి పాలనలో ప్రజలు సుఖ శాంతులతో భోగభాగ్యాలతో వర్ధిల్లుతుంటారు. అయితే స్వార్థపరుడైన మంత్రి బిజ్జల దేవ(నాజర్)...బాహుబలి సోదరుడు, క్రూరుడైన భల్లలదేవ(రానా)తో చేతులు కలిపి రాజును యుద్ధంలో చంపి రాజ్యాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు.