Pages

పెళ్లి కూతురు పూలదండ సరిగా మేడలో వేయలేదని .....



ఉత్తర భారతదేశంలో ఓ పెళ్ళి జరుగుతోంది. ఫోటోలు, వీడియోలను ఏర్పాటు చేసుకున్నారు. అయితే మాలధారణ సీన్ పండించేందుకు కెమెరామెన్లు దర్శకుల పాత్రను తీసుకున్నారు. అక్కడ అమ్మాయి కాస్తంత పొట్టి , అబ్బాయి కాస్తం పొడవు, ఇవి సహజమనుకోండి. అయితే కాస్త సిగ్గుపడుతూ, పెళ్ళికొడుకు ముఖం వైపు చూడకుండా పాత సినిమా తరహాలో దండ వేయించడానికి కెమెరామెన్లు ప్రయత్నం చేశారు. అయితే వీరు చేసిన హడావుడి చేసి పెళ్ళికూతురు హైరానా పడిపోయింది. 

తలదించుకుని అబ్బాయి మెడలో వేయాల్సిన పూలమాలని పదేపదే అతడి తలపై వేసింది. అంతే.. అప్పటివరకు ఆ సీన్ పక్కాగా రావడం కోసం ఓపిక పట్టిన పెళ్లి కొడుక్కి ఒక్క సారిగా పట్టరానంత కోపం వచ్చింది. ఇంకేం... నువ్వూ వద్దు.. నీ పెళ్లి వద్దన్నట్లుగా ఆ పూలమాలని తీసి నేలకేసికొట్టాడు. పక్కనున్న సీట్లో కూర్చుండి పోయాడు. తిరిగి పెద్దలు రంగప్రవేశం చేసి నచ్చజెప్పి పెళ్ళితంతు కానిచ్చేశారు.