భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ,
మరోవైపు పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్‌లు చర్చలకు సిద్ధమవుతున్న తరుణంలో సరిహద్దుల్లో
పాకిస్థాన్ సైన్యం బరితెగించింది. భారత జవాన్లను టార్గెట్ చేసిన పాకిస్థాన్ సైన్యం..
కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచి ఓ భారత జవానును
బలితీసుకుంది. వాస్తవాధీన రేఖ వద్ద స్నిప్పర్ ఫైర్ జరిగిందని, బారాముల్లా సెక్టారులోని
కరాం పోస్టు వద్ద ఈ ఘటన జరిగిందని సైన్యాధికారులు చెబుతున్నారు. ఈ దాడిలో గార్డ్ డ్యూటీలో
ఉన్న జవాను చనిపోయాడని, గురిచూసి అతని కంటిలో పాకిస్థాన్ సైనికులు కాల్చారని పేర్కొన్నారు.
కాగా, ఈ వారంలో పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘంచడం ఇది మూడోసారి కావడం గమనార్హం.