Pages

పెళ్లాడిన తర్వాత భార్యతో అలా ఉండాలంతే...: పవన్ కళ్యాణ్‌పై నిమ్మల కిష్టప్ప


pawan kalyan కోసం చిత్ర ఫలితం  pawan kalyan కోసం చిత్ర ఫలితం


ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానంటే పవన్‌ కళ్యాణ్‌ కోసం తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేస్తానని అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పవన్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పోరాటం చేయాలని సూచించారు. 

అప్పుడు తాము కూడా వెన్నుదన్నుగా నిలుస్తామని అన్నారు. పవన్‌ కల్మశం లేని వ్యక్తి అని, ఎవరో చెప్పిన మాటలు విని ఆయన అలా మాట్లాడారని ఆయన అన్నారు. తాము కూడా పవన్‌ అభిమానులమేనని ఆయన అన్నారు. ఏమీ ఆశించకుండా టీడీపీ కోసం గత ఎన్నికల్లో ప్రచారం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. తాము పని చేస్తున్నామో లేదో తెలవాలంటే టీడీపీ కార్యాలయానికి వచ్చి చూడాలని అన్నారు.

పెళ్లాడిన తర్వాత భార్యతో అన్యోన్యంగా ఉండాలి తప్పకొడతానంటే ఎలా? అని అనంతపురం జిల్లా హిందూపురం తెలుగదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు నిమ్మల కిష్టప్ప జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించారు.