Pages

పవన్ కళ్యాణ్ పైన తొడ కొట్టాలంటే బావ రావాలి? బాలకృష్ణ

balakrishna-and-pawan
వన్ వ్యాఖ్యలపై అటు టిడిపి నేతలు గరగరంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు ఎంపీలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. పవన్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని పవన్ కు సూచించారు. భేషజాలను రెచ్చకొట్టే విధంగా పవన్ మాట్లాడుతున్నారని అంటూ కొంతమంది పవన్ కళ్యాణ్ పై హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసులు కూడా పెట్టారు.
ఈ కేసులపై తనకెలాంటి భయం లేదని.. అవసరమైతే జైలుకు వెళ్ళడానికి సిద్దంగా ఉన్నానని కూడా పవన్ ఈరోజు ట్విట్టర్ లో పేర్కొన్నారు. పవన్ ట్విట్టర్ లో ఈ వ్యాఖ్యలు చేసిన తరువాత అటు విజయవాడలో జనసేన కార్యకర్తలు కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్ లో ధర్నా నిర్వహించారు. పవన్ ప్రచారం చేయకపోతే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలిచేది కాదని అంటూ వారు నినాదాలు చేశారు.
తెలుగుదేశం పార్టీలో కీలక నేతలైన లోకేష్ ఇంతవరకు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించలేదు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నాలుగు ఎంపీటిసి స్థానాలు గెలిచిందని.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుందని చెప్తున్నారే తప్పా.. పవన్ వ్యాఖ్యలపై మాత్రం స్పందించడంలేదు. ఇక, మరోనేత, సినీనటుడు బాలకృష్ణ కూడా ఈ విషయంపై స్పందించకపోవడం విశేషం. పవన్ వ్యాఖ్యలపై బాలకృష్ణ స్పందిస్తారని అందరు అనుకుంటున్నారు. ఒకవేళ బాలకృష్ణ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందిస్తే.. ఏమని స్పందిస్తారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.