నితిన్ కు క్లాస్ పీకిన నాగార్జున ?

klaas : nitin ni mandalinchina naagaarjuna
నాగార్జున చాలా విషయాల్లో లెక్కల్లో ఉండే మనిషి. ముఖ్యంగా ఓ నిర్మాతగా ఆయన చాలా ఫెరఫెక్ట్ గా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారని చెప్తూంటారు. అది తను హీరోగా చేసే సినిమా అయినా, తన కొడుకుతో చేసే సినిమా అయినా ఆయన ఆచి, తూచి ఎమోషన్ కు లోన్ కాకుండా నిర్ణయాలు తీసుకుంటూంటారు.

అందులో భాగంగానే రీసెంట్ గా నితిన్ కు నాగార్జున క్లాస్ తీసుకున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకునేదాని ప్రకారం... అఖిల్ చిత్రం విషయమై నాగార్జున ..రీసెంట్ గా నితిన్ ని పిలిచి మాట్లాడారని తెలుస్తోంది. మొదట అనుకున్న 30 కోట్లు బడ్జెట్ దాటి వెళ్ళటమే అందుకు కారణం అంటున్నారు.


నితిన్ ఉత్సాహంగా మరింత బడ్జెట్ పెట్టడానికి వెనకాడకపోవటం నాగార్జునని ఆందోళనకు గురి చేసి మందలించినట్లు చెప్పుకుంటున్నారు. అఖిల్ ఇంట్రడక్షన్ సినిమా కాబట్టి...బిజినెస్ ఏ విధంగా జరుగుతుందో చెప్పలేము అని, అలాంటప్పుడు ఖర్చులు చాలా జాగ్రత్తగా చూసి చెయ్యాలని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. నితిన్ సైతం తన వైపు నుంచి కారణాలు చెప్పినట్లు చెప్పుకుంటున్నారు.