Pages

డైరెక్టర్ గెస్ట్ హౌస్‌కు వెళ్లిన ఇలియానా... అందుకోసమేనా?

దక్షిణాది చిత్ర పరిశ్రమలో క్రేజీ బ్యూటీగా వెలిగిన అందాల భామ ఇలియానా. టాలీవుడ్, కోలీవుడ్‌లలో వరుస విజయాలతో దూసుకుపోతున్న సమయంలో ఇలియానాకు బాలీవుడ్‌పై మోజు పుట్టింది. దీంతో చక చకా దుకాణం కట్టేసి అక్కడికి వెళ్లింది. అయితే ఇలియానాకు అక్కడ ఆశించిన స్థాయిలో ఆఫర్ల వరించలేదు. దీంతో ఖంగుతిన్న అమ్మడు గోడకు కొట్టిన బంతిలో మళ్లీ సౌత్‌కే వచ్చేసింది.
అయితే అప్పటికీ ఇక్కడ ఆమె స్థానంలో బర్తి అయిన కొత్త హీరోయిన్ల‌ను దాటి ఇలియానాకు ఆఫర్లు రావడం లేదు. అయినప్పటికీ ఎలా అయినా సౌత్‌లో తను పూర్వ వైభవాన్ని పొందాలనే పట్టులో ఉంది ఇలియానా. ఈ స్థితిలో అమ్మడు గురించి తాజాగా కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌ ఒకటి హల్‌చల్ చేస్తోంది. ఇలియానా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ డైరెక్టర్‌ ఒకరిని సొంత గెస్ట్ హౌస్‌లో కలుసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

ఇల్లీ బ్యూటీ వెరీ రిసెంట్‌గా కోలీవుడ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందని ప్రముఖ డైరెక్టర్ శంకర్‌ని, ఆయన ఉంటున్న సొంత గెస్ట్ హౌస్‌లో కలుసుకుందని కోలీవుడ్ వర్గాల సమాచారం. సాధారణంగానే హీరోయిన్లు హీరోల, దర్శక నిర్మాతల గెస్ట్‌ హౌస్‌కు ఎందుకు వెళతారో అందరికీ తెలిసిన విషయమే. ఈ స్థితిలో ఇలియానా శంకర్ గెస్ట్ హౌస్‌కు వెళ్లినట్లు వస్తున్న వార్త కోలీవుడ్‌లో సంచలనం రేపుతోంది.