భగవంతునికి భక్తునికి మధ్య "సైకిల్ బెల్లు" కొట్టనున్న అమితాబ్ బచ్చన్. !
బాలీవుడ్ బిగ్ బీ అమీతాబచ్చన్ ఒక వైపు సినిమాలలో నటిస్తూనే, మరో వైపు పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ నాలుగు చేతులా సంపాదిస్తున్నారు. ఆయన తాజాగా మరో సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. భక్తునికి దైవానికి అనుసంధానమైన సైకిల్ బ్రాండ్ అగర్ బత్తీల తయారీ సంస్థ అమితాబ్ బచ్చన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
అగర్ బత్తీల తయారీలో ఇప్పటికే దేశంలో అతిపెద్ద కంపెనీగా ఎదిగిన తాము, రానున్న మూడేళ్లలో తమ మార్కెట్ వాటాను రెండింతలు చేసుకునేందుకు ప్రణాళికలు రూపొందించామని ఆ కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. అందులో భాగంగా తొలుత పశ్చిమ బెంగాల్ మార్కెట్‌పై దృష్టి సారించిన తాము అమితాబ్ బచ్చన్‌ను ప్రచారకర్తగా నియమించుకున్నామని వివరించింది.