ఆ మధ్య దుబాయ్ లో గాల్లో కరెన్సీ నోట్లు వర్షం కురిసిందని తెలుసు ఇప్పుడు అలాగే మన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరెన్సీ నోట్లు సముద్ర జలాల్లో కొట్టుకువచ్చి సంచలనంగా మారాయి.
సరిగ్గా నిన్న సాయంత్రం ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదుగానీ సముద్రంలో వెయ్యి రూపాయల నోట్లు అలా తేలుకుంటూ పోతున్నాయి. క్షణాల్లో ఈ విషయం దావానలంలా వ్యాపించింది.
దీంతో మత్స్యకారులు, కొంతమంది ఈతగాళ్లు అక్కడికి చేరుకున్నారు. తలా కొన్ని నోట్లను దొరకబుచ్చుకున్నారు. అటు సముద్రం ఒడ్డున జనప్రవాహం, ఇటు సముద్రంలోలో నీటి ప్రవాహం ఉధృతమైంది. దీంతో అక్కడి గుమిగూడినవారంతా చేసేదేమీ లేక అలా ఊసూరుమంటూ చూస్తూ ఉండియారు.
మరికొంత మంది ఈ దశ్యాలను తమ తమ కెమెరాల్లో బంధించారు. ఇంతలో పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. డబ్బుల కోసం ప్రాణాలను సైతం పణంగా పెడుతున్న కొంతమంది వారించి, జనాన్ని చెదరగొట్టారు.
అయితే ఆ నోట్లు ఎలా ఎక్కడి నుంచి వచ్చాయనేది మాత్రం ఎవరికీ అంతుబట్టడంలేదు. దొంగల బారినుంచి కాపాడుకోవడానికే ఒక ధనవంతుడు లక్షల కొద్దీ డబ్బులున్న సంచిని నదిలో విసిరేశాడనే కథనం మాత్రం ప్రచారంలో ఉంది. అయితే దీనికి సంబంధించి పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు.