మైక్రోమాక్స్ గజని తో పెళ్ళికి రెడీ అయిన ఆసిన్


ఇన్నాళ్లూ పెళ్లెప్పుడంటే ఒంటికాలిపై లేచిన ఈ ముద్దుగుమ్మ.. ఈసారి ఎవరూ అడక్క ముందే.. తన వివాహంపై జనాలకు హింట్ ఇచ్చింది. తనకు హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నా... కావాలనే కొంతకాలంగా ఏ చిత్రాన్నీ అంగీకరించడంలేదని స్పష్టం చేసిన అసిన్... ఇకపై వ్యక్తిగత జీవితానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. 

గజని సినిమాలో మొబైల్ కంపెనీ ఓనర్ అయిన సూర్యను ప్రేమించినట్లుగా నిజజీవితంలోనూ అసిన్ మైక్రోమాక్స్ మొబైల్ కంపెనీ అధినేత అయిన రాహుల్ శర్మతో నాలుగేళ్లుగా డేటింగ్ చేస్తోందట.... త్వరలో చెలికాడి చేయి అందుకోబోతున్నందునే ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. 

మరి.. ఇంత రివీల్ చేసిన అసిన్ ఆ పెళ్లి ముచ్చట కాస్తా ఎప్పుడో చెప్పేస్తే జనాలు సంతోషిస్తారు. ఏమైనా... మొత్తానికి ఆల్ ఈజ్ వెల్ సినిమా తరువాత అసిన్ సినిమాలకు టాటా చెప్పేయడం ఖాయమని స్పష్టం అయిపోయింది. మరి..