సోషల్ మీడియా ద్వారా ఆన్ లొకేషన్ స్టిల్స్ కొన్ని బయటకు వచ్చాయి. ఇందులో ఓ ఫోటోలో నాగార్జునను వీల్ చెయిర్ లో కూర్చొపెట్టి తీసుకెలుతున్న ఉంది. ఈ ఫోటో చూస్తుంటే సినిమా ఫుల్ ఫన్ ఎలిమెంట్స్‌తో సాగుతుందని స్పష్టమవుతోంది. నాగార్జున మాట్లాడుతూ...తెలుగు, తమిళ భాసల్లో రూపొందుతున్న ఈ మూవీ చాలా బాగా వస్తోంది.
వంశీ పైడిపల్లి సినిమాని చాలా ఎక్స్‌ట్రార్డినరీగా తీస్తున్నారు. నా కెరీర్ లో ఇది చాలా డిఫరెంట్ కమర్షియల్ మూవీ అవుతుంది. పివిపి గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని చాలా లావిష్ గా నిర్మిస్తున్నారు అన్నారు. కార్తి మాట్లాడుతూ...తెలుగులో ఫస్ట్ టైమ్ చేస్తున్న స్ట్రైట్ మూవీ చాలా భారీ లెవల్ లో నిర్మిస్తున్నారు పివిపిగారు. నాగార్జున లాంటి పెద్ద స్టార్ తో కలిసి ఈ సినిమాకి వర్క్ చేయడం చాలా థ్రిల్లింగ్ గా ఉంది' అన్నారు.