మీరు ఒకే ఇంట్లో రోజు గడిపి బోర్ గా పీలవుతున్నారా..అయితే మీకు అదిరిపోయే ఇల్లును తొందరలో బయటకు తీసుకురానున్నారు. స్మార్ట్ ఫోన్లలాగా స్మార్ట్ హౌస్ లు కూడా థొందరలో పట్టాలెక్కనున్నాయి. ఇక ఆ ఇంట్లోపసకల సౌకర్యాలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఆ ఇంట్లో ఉంటే మీరు స్వర్గంలో ఉన్నట్లే అనిపిస్తుంది
న్యూజిలాండ్ కు చెందిన జాన్ విలియమ్స్ అనే ఆయనకు ఈ గుహ లాంటి ఇల్లును నిర్మించాలని ఆలోచన వచ్చిందట. అది ఎంతో ఎత్తున ఆకాశహర్మ్యాలను తాకే విధంగా ఇంకా చుట్టూ గుహాలగా దీన్ని డిజైన్ చేయాలనుకుంటున్నారు.ఆయన స్వతహాగా ప్లాస్టిక్ ఇంజనీర్ అలాగే గ్రాఫిక్ డిజైనర్ కావడంతో ఇటువంటి ఇంటికి రూపకల్పన చేశారు. సౌరశక్తితో ఈ ఇంటికి వెలుగులు విరజిమ్మతాయి. ఇల్లు విండో ఆకారంలో ఉంటుంది. అందులో అన్ని సదుపాయాలు మీకు లభిస్తాయి.