ఎప్పుడూ మీరు మాత్రమే బీరు తాగుతానంటే ఎలా... అందుకే... మీరు మాత్రమె కాదు... మీ బండికి బీరు తాగించవచ్చు అంటున్నారు ఒక కంపెనీ వారు... ప్రపంచం లో తొలిసారిగా ఒక కంపెనీ బీరు తో పెట్రోల్ తయారు చేసింది... న్యూజిలాండ్ పెట్రోల్ బుంక్ లో ఇప్పుడు రెండు రకాల పెట్రోల్ అమ్ముతున్నారు. ఒకటి మామూలు పెట్రోల్ కాగా...రెండవది బీరు తో తయారు చేసింది. ఇలా అరవై పెట్రోల్ బంక్ లలో అమ్మడం విశేషం... పైగా ఈ బీట్రోలియం (బీరు తో తయారు చేసే పెట్రోల్) వలన పర్యావరణం మంచిగా అవుతుందని చెప్తున్నారు.
ఇక... బీరు వల్ల గాల్లో కార్బన్ డై ఆక్సైడ్ పెరుగుతుందని... పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతామని తయారి దారులు చెప్తున్నారు... కాని బీరు ప్రియులు మాత్రం కొంచెం కంగారు పడుతున్నారట... సమ్మర్ లో కూల్ కూల్ గా చల్లటి బీరు తాగడానికి... బీర్ల కొరత ఏర్పడుతుందేమో అని..!!