మెగా ఫ్యామిలీ మరోసారి అభిమానులను ఖుషీ చేయనుంది. చిరంజీవి మొదలు వరుణ్ తేజ్ వరకు మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటివరకు హీరోలే వచ్చారు. వారంతా అభిమానులను ఆనందింపజేస్తూ హీరోలుగా దూసుకుపోతున్నారు. ఇంతమంది హీరోలతో అదరగొడుతున్న మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ మాత్రం రాలేదని భాదపడే అభిమానులకు ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ రూపంలో హ్యాపీనెస్ రాబోతుంది.
అసలు విషయానికి వస్తే, ప్రజెంట్ ఓ టీవీలో రియాలిటీ షోకు యాంకరింగ్ చేస్తున్న మెగా హీరో నాగబాబు గారాలపట్టి నీహారికను హీరోయిన్ గా చూడాలని నాగబాబు ఆశపడుతున్నారని సమాచారం. తాజాగా నాగబాబు కుమార్తె నీహారిక.. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో సినిమా వాతావరణమే ఉండడంతో నాకూ ఆ గాలి సోకిందని, అలాగే నాన్న కోరిక ప్రకారం సిల్వర్ స్క్రీన్ మీద మెరవాలని నాకూ కోరికగా ఉందని తన మనసులో మాట బయటపెట్టారని తెలుస్తుంది. దీంతో నాగబాబు కూడా ఇప్పుడు నీహారిక ప్రాజెక్టుపై సీరియస్ గా వర్కవుట్ చేస్తున్నారని సమాచారం. మరి ఇదే గనుక నిజమైతే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన తొలి మెగా హీరోయిన్ ఘనత తనకే దక్కుతుంది.