Pages

చిరంజీవి గురించి అసలు విషయం చెప్పిన సుమన్

80వ దశకంలో అప్పుడే స్టార్ హీరో ఇమేజ్ ని దక్కించుకోబోతున్నాడు హీరో సుమన్. అందగాడు డ్యాన్స్ కూడా బాగానే వేయగల సమర్ధుడు కాబట్టి సుమన్ కు మంచి అవకాశాలు కూడా వచ్చాయి. కాని ఎందుకో అనుకున్నత క్రేజ్ రావడం సరికదా కొన్ని అనివార్య కారణాల వల్ల జైలుకి కూడా వెళ్లాడు సుమన్. 
chiranjivi gurinchi asalu vishayam cheppina suman
అయితే ఇప్పుడు క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా సూపర్ క్రేజ్ సంపాధించిన సుమన్ ఈ నెల 28న తన పుట్టినరోజు సందర్భంగా ఓ ప్రముఖ ఛానెల్ వారు జరిపిన ఇంటర్వ్యూలో చాలా విషయాలు బయటపెట్టాడు. సరిగ్గా తాను స్టార్ డం తెచ్చికుంటున్న ఆ టైంలోనే తనని అరెస్ట్ చేయించారని చెప్పాడు సుమన్. అయితే కొన్ని వాదలనల ప్రకారం తన అరెస్ట్ కి మెగాస్టార్ చిరంజీవి కూడా కారణమని అంటుంటారని, దానికి స్పందిస్తూ తాను జైలు కెళ్లే విషయంలో చిరంజీవి కుట్ర ఏం లేదని తేల్చి చెప్పాడు. 

కాని ఇండస్ట్రీలో కొంతమంది మాత్రం కావాలనే తనపై అలా కుట్ర పన్ని లేనిపోని ఆరోపణలు మోపి జైలుకి పంపారని చెప్పాడు. ఎప్పటినుండో అందరికి తాను ఈ విషయంపై క్లారిటీ ఇవ్వదలచుకున్నానని అసలు తాను జైలు కెళ్లడంలో చిరంజీవి ప్రమేయం ఏం లేదని ఇలాంటివి ఇంకోసారి ఎవరైనా అన్నా తన ఆగ్రహానికి గురవుతారని అన్నాడు.

Related Post:
హీరో సుమన్ తన జైలు జీవితం గురించి ఓ పత్రికకు ఇచ్చిన షాకింగ్ ఇంటర్వ్యూ..?