ఆయన ఓ మంత్రి , పిల్లలకు ఉపయోగపడే నాలుగు మంచి మాటలు చెబుతాడని తమ కాలేజ్ లో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. చీఫ్ గెస్ట్ హోదాలో వచ్చిన ఈ మంత్రి చాలా చీప్ గా మాట్లాడాడు. ఆదర్శంగా ఉండాలని చెప్పాల్సిన మినిష్టర్ గారు అశ్లీలపు పాఠాల గురించి బాహాటంగా చెప్పారు.
పైగా నేను కూడా మీలాంటివాడినేనని వివరణ ఇచ్చుకున్నారు. అసలు విషయంలోకి వెళితే.పూణెలోని ఓ కళాశాలలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్లిన మహారాష్ట్ర ఆహార శాఖా మంత్రి గిరీష్ బాపత్.. ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ. రాత్రుళ్లు మీరు మీ మొబైల్ ఫోన్లలో ఎలాంటి క్లిప్పింగ్స్ చూస్తారో మేం కూడా అవే చూస్తాం. మాకు వయసై పోయిందని ఎలా అనుకుంటారు? మా మనసుకు సంబంధించినంత వరకూ మేము ఇంకా యువకులమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.