జగన్.. చిరంజీవి. ఇద్దరూ ఏపీకి ముఖ్యమంత్రి అయిపోదామని కలలు కన్నవాళ్లే.. అందుకోసం విపరీతంగా కృషి చేసిన వాళ్లే.. రాజకీయాల్లో సొంత పార్టీ పెట్టుకుని అధికారం సాధించాలని ఆశపడినవారే.. కానీ కాలం కలసి రాలేదు. ఇద్దరిలో జగన్ పరిస్థితి కొంత బెటర్.. ఓడిపోయినా గౌరవనీయంగా ప్రతిపక్షనేత హోదా అయినా దక్కింది.
చిరంజీవి మాత్రం అనూహ్యంగా బోల్తా పడ్డారు.. 2009 ఎన్నికల్లో కేవలం 18 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలుచుకుని భంగపడ్డారు. చివరకు తాను కూడా సొంత జిల్లాలో ఓడిపోయి తీవ్ర అవమానాలకు గురయ్యారు. ఆ తర్వాత పార్టీని సొంతగా నడపలేక కాంగ్రెస్ లో చేరారు. ఆ సమయంలోనే ఆయన వైఎస్ జగన్ పై విపరీతంగా విమర్శలు కురిపించారు.
అలాంటి వీరిద్దరూ ఓ చోట చేరడం.. చేతులు కలుపుకోవడం.. కొద్దిసేపు ముచ్చట్లు చెప్పుకోవడం చూపరులకు ఆసక్తికలిగించింది. ఈ అరుదైన దృశ్యానికి ప్రముఖ పారిశ్రామికవేత్త రామేశ్వరరావు షష్టిపూర్తి వేడుక అయ్యింది. ఈ సంబరానికి రాజకీయాలకు అతీతంగా పలువురు ప్రముఖ నేతలు హాజరవడమే కాకుండా ఒకరిని ఒకరు పలకరించుకుంటూ సరదాగా గడపేశారు. వైసీపీ అధినేత జగన్, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కొద్దిసేపు ముచ్చట్లు కూడా చెప్పుకున్నారు.