Pages

కష్టపడకుండా 'సొమ్ము' చేసుకుంటున్నాడు

సులభంగా డబ్బు సంపాదించాలని చాలామంది ఆశపడతారు. కొంతమంది ఇందుకోసం అడ్డదారులు కూడా తొక్కుతారు. కానీ ఈ ఫోటోలోని పెద్దాయన మాత్రం ఒక చిన్న ఐడియాతో ఏమాత్రం కష్టపడకుండా సొమ్ము చేసుకుంటున్నాడు. 
kashtapadakunda 'sommu' chesukuntunnaadu
అది కూడా చట్టబద్ధంగానే..! అమెరికాకు చెందిన గ్యారీ అనే 60 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి తాను ఖర్చు చేసే ప్రతి డాలర్ పైనా ''నేను చాలా పేదవాడిని. దయచేసి ఈ డాలర్ నాకు తిరిగి పంపించండి'' అని రాసి తన చిరునామా పొందుపరుస్తున్నాడు. ఈ ఐడియా బాగానే వర్కవుట్ అయి, సగటున రోజుకు రెండు డాలర్ల చొప్పున వెనక్కి వస్తున్నాయట. 

కొంతమంది అతడి నోటుతో పాటు బోనస్ గా మరికొంత కూడా పంపిస్తున్నారు. ఇలా మొత్తమ్మీద నెలకు వంద డాలర్లపైనే వెనక్కి వస్తుండటంతో గ్యారీ ఫుల్ హ్యాపీ...!