ఆమె ఎంత మందికి అత్త .!!!?

త్రివిక్రమ్ డైరెక్షన్‌లో నితిన్, సమంత జంటగా తెరకెక్కుతున్న అ...ఆ అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు మొదలైంది. వాలంటైన్స్ డే కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని వినిపిస్తోంది. అత్తాఅల్లుళ్ల మధ్య జరిగే ఫ్యామిలీ వార్ నేపధ్యంగా 'అ ఆ' రూపొందుతోందట. 


nitinku kuda 'atta' aamenata..!
గతంలో వచ్చిన చిరంజీవి అత్తకు యముడు అమ్మాయికి మొగుడు షేడ్స్ ఈ మూవీ స్టోరీలో ఉన్నాయని తెలుస్తోంది. అత్తారింటికి దారేది చిత్రంలో అత్త క్యారెక్టర్‌కి ఫుల్ క్రేజ్ రావడంతో అదే సెంటిమెంట్‌ని కంటిన్యూ చేస్తూ ఈ మూవీలో కూడా త్రివిక్రమ్ నదియాను రంగంలోకి దింపాడని టాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఈ మూవీలో అనసూయ రామలింగం పాత్రలో నదియా కనిపించబోతుందట. ఆమె కూతురుగా సమంత నటిస్తూ ఉంటే..నదియా అల్లుడు ఆనంద్ విహారి క్యారెక్టర్‌ని.. నితిన్ పోషిస్తున్నాడని సమాచారం. ఈ చిత్రానికి కొలవెరి ఢి ఫేమ్ అనిరుధ్ స్వరాలు సమకూరుస్తున్నాడు. పవన్‌కు అత్తగా నటించి సూపర్ హిట్ అందించిన నదియా..నితిన్‌కు ఏ రేంజ్ హిట్ ఇస్తుందో వేచి చూడాలి.