భర్తతో గొడవపడి ఇంటికి వచ్చిన ఆ వివాహితకి తల్లిదండ్రులే యములైయ్యారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ మహిళ కొంతకాలం పుట్టింట్లోనే ఉంది. అయితే కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన కన్నవారే వ్యభిచారం చేయమని ఒత్తిడి చేయడంతో అవమానం భరించలేక ఆ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు మండలం వేల్పూరులో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. వేల్పూరుకు చెందిన కృపారాణి ప్రేమ పెళ్ళి చేసుకుంది. ఈ మధ్య భర్తతో గొడవపడి తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. అయితే డబ్బు మోజుతో కన్నకూతుర్నే పణంగా పెట్టాలనుకున్నారు ఆమె తల్లిదండ్రులు. ఆ బాధను ఎవరితో చెప్పుకోలేని దీన స్థితిలో ఓ యువతి ఆత్మహత్యే శరణ్యం అని భావించింది. అయితే తన బాధ వేరెవరూ పడకుడదని భావించిన ఆ వివాహిత ఈ విషయాన్ని సెల్ఫీలో రికార్డు చేసి, తన బాధను వ్యక్తం చేసింది. దుర్మార్గులకు కఠిన శిక్ష పడేలా చూడాలని సెల్ఫీలో పోలీసులను కోరింది.
తల్లిదండ్రులే వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేయడంతో మనస్థాపానికి గురై బలవన్మరణానికి పాల్పడింది. చనిపోయే ముందు వీడియోలు తన ఆవేదనను రికార్డు చేసింది. స్థానిక నాయకుడి సాయంతో కృపారాణిని బలవంతంగా నగ్నంగా వీడియో తీసి తల్లిదండ్రులు బెదిరించారు. ఈ అవమాన భారంతో కాలువలో దూకి కృపారాణి ఆత్మహత్య చేసుకుంది.