తెలిసో తెలియక సినిమాల్లోకి రాకముందు ఆ తప్పు చేశానని, కానీ ఇప్పుడు మాత్రం ఎంత డబ్బిచ్చినా ఆ పనికి మాత్రం ఒప్పుకోనని అంటోంది తెల్ల పిల్ల తమన్నా. అసలు సంగతేమిటంటే...ఓ ఫేస్ క్రీమ్ యాడ్‌లో నటించమని తమన్నాను అడిగారు. ఆ ఫేస్‌క్రీమ్ వాడితే ముఖ వర్చస్సు పెరుగుతుందనీ, రంగు వస్తారని తమన్నా చెప్పాలి. ఇందుకోసం రెమ్యునరేషన్ ఎంత అడిగినా ఇస్తామన్నారు నిర్వాహకులు.
అయితే ఆ యాడ్ చేయను పొమ్మంది తమన్నా! ఆ యాడ్‌లో తను చెప్పినట్టు ముఖం రంగు మారకపోయినా. భవిష్యత్తులో కంపెనీ వారు ప్రకటించిన ఫలితాలు రాకపోయినా, తన మీద కేసు పెట్టే అవకాశం ఉందని తమన్నా భయపడింది. సరిగ్గా ఇలాంటి కేసుల్లోనే పలువురు సినీ నటులు ఇరుక్కున్న సందర్భాలు గుర్తుకు వచ్చి తమన్నా ఆ యాడ్‌లో నటించకూడదన్న నిర్ణయం తీసుకుందట! తమన్నా సినిమాల్లోకి రాకముందు ఫెయిర్‌నెస్ క్రీం యాడ్ చేసిన విషయం తెలిసిిందే.