Pages

షాక్.....ప్రభాస్ లేకుండానే 'బాహుబలి-3' !

‘బాహుబలి’ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది రాజమౌళి మరియు ప్రభాస్‌. వీరిద్దరి కలయికలో ఇప్పటికే వచ్చిన ‘బాహుబలి’ మొదటి పార్ట్‌ సంచలన విజయాన్ని సాధించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం రెండవ పార్ట్‌కు సంబంధించిన వర్క్‌ జరుగుతోంది. వచ్చే నెలలో ‘బాహుబలి’ రెండవ పార్ట్‌ చిత్రీకరణ ప్రారంభించబోతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. రెండవ పార్ట్‌ను వచ్చే సంవత్సరం చివర్లో విడుదల చేసే అవకాశాలున్నాయి. రెండవ పార్ట్‌ విడుదల అయిన తర్వాత మూడవ పార్ట్‌ను కూడా జక్కన్న తీసుకు వస్తాడనే విషయం అధికారికంగా క్లారిటీ వచ్చింది.


బాహుబలి 3 కోసం చిత్ర ఫలితం
‘బాహుబలి’ కథ రెండవ పార్ట్‌తో ముగుస్తుందని, మూడవ పార్ట్‌కు ఈ కథతో సంబంధం ఉండదు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ‘బాహుబలి 3’ ఎలాంటి కథతో తెరకెక్కబోతుంది, అసలు మూడవ పార్ట్‌ ఆలోచన జక్కన్నకు ఎందుకు వచ్చింది అనే విషయంపై ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జక్కన్న కుటుంబ సభ్యుల నుండి తెలుస్తున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ‘బాహుబలి’ మూడవ పార్ట్‌లో ప్రభాస్‌ కనిపించడట. ప్రభాస్‌ లేకుండా ‘బాహుబలి’ మూడవ పార్ట్‌ను రాజమౌళి తెరకెక్కించే ప్లాన్‌ చేస్తున్నట్లుగా వారు చెప్పుకొచ్చారు. అంటే వేరే హీరోతో సినిమా చేస్తాడా లేక మరేదైనా ప్రయోగం చేయనున్నాడా అనేది ప్రస్తుతం ఆసక్తికర అంశంగా ఉంది.