99 కార్లతో బయలుదేరిన బాలకృష్ణ ... ఎక్కడికో తెలుసా ..!

నందమూరి నటసింహం బాలయ్య, శ్రీవాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న డిక్టేటర్ ఆడియో వేడుకకు రంగం సిద్ధమైంది. ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతిలో డిక్టేటర్ ఆడియో వేడుక జరగనుండగా ఈ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేసారు. అయితే సాయంత్రం జరగనున్న ఈ పాటల వేడుకకు ఏపి సిఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిధిగా హాజరుకానున్నట్టు సమాచారం.

బాలయ్యకు డిక్టేటర్ 99వ సినిమా కాగా అభిమానులు భారీ ఎత్తున అమరావతికి తరలి వస్తున్నారు. అంతేకాక బాలయ్య కూడా ఇప్పటికే అమరావతికి పయనం కాగా 99 కార్లతో అక్కడికి బయలు దేరినట్టు సమాచారం. యూనిట్‌తో కలిసి బయలు దేరిన బాలయ్యకు అక్కడ అభిమానలు ఘన స్వాగతం పలికేందుకు సిద్దమయ్యారు. ఇంక థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా పాటలు చిత్రానిఇకి స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారనుందని యూనిట్ భావిస్తోంది. ఇంక ఈ చిత్రంలో హీరోయిన్లుగా అంజలి, సోనాల్ చౌహన్, అక్షలు నటించనుండగా శ్రద్ధా దాస్ స్పెషల్ డ్యాన్స్‌తో మెరవనుంది.

రోజా నడుము పైన సోమిరెడ్డి హాట్ హాట్ కామెంట్స్

వైసీపీ ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేసిన తర్వాత కూడా ఆమెపై టీడీపీ నేతల దాడి ఆగడం లేదు. తమ చర్యను సమర్థించుకునే ప్రయత్నం టీడీపీ నేతల వైపు నుంచి కొనసాగుతూనే ఉంది. రోజా అసెంబ్లీలో బరితెగించి ప్రవర్తిస్తున్నారని.. ఆమెపై సస్పెన్షన్ వేటు వేయడంలో ఏమాత్రం తప్పులేదని.. టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు.

అంతే కాదు.. రోజా కోసం వైసీపీ అధినేత జగన్ కూడా దిగజారి ప్రవర్తిస్తున్నారని సోమిరెడ్డి మండిపడ్డారు. రోజాపై సస్పెన్షన్ ఎత్తివేయకుంటే సభను జరగనివ్వబోమని జగన్ చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. జగన్ జనం కోసం ఉన్నారా.. కేవలం ఒక్క రోజా కోసమే ఉన్నారా అని కామెంట్ చేశారు.
roja
రోజా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తానంటే ఊరుకోబోమని సోమిరెడ్డి హెచ్చరించారు. అంతవరకూ బాగానే ఉంది.. ఆ తర్వాత సోమిరెడ్డి ప్రెస్ మీట్ దారితప్పినట్టు కనిపించింది. ఆన్ ది రికార్డు మాట్లాడిన తర్వాత.. ఆయన విలేఖరులతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారట. రోజాపై వ్యక్తిగతంగా దూషించారట. రోజాకు సన్నని నడుము ఉందని ఎలా పడితే అలా గెంతుతానంటే ఊరుకుంటామా అని కామెంట్ చేశారట. 

సోమిరెడ్డి రోజాను ఇంకో వివాదంలోకి కూడా లాగినట్టు తెలుస్తోంది. రోజా సభలో మేమేమైనా దళితులమా అని కామెంట్ చేసిందని సోమిరెడ్డి అన్నారట. రోజా దృష్టిలో దళితులు హీనమైన వాళ్లా అంటూ సోమిరెడ్డి ప్రశ్నించినట్టు సమాచారం. దళితులను కించపర్చిన రోజా వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. 



చంద్ర బాబును బఫూన్ చేసిన సింగపూర్ ....

సింగపూర్ సాయంతో మనం చిటికెలో రాజధాని కట్టేస్తాం.. సింగపూర్ కంటే బ్రహ్మాండంగా కడతాం.. సింగపూర్ లో అవినీతి అనేది చూశారా ఎక్కడైనా.. సింగపూర్ మనకు ఉత్తి పుణ్యానికే పైసా తీసుకోకుండా మాస్టర్ ప్లాన్ రూపొందించి ఇచ్చింది.. ఇవీ చంద్రబాబు రాజధాని నిర్మాణం గురించి ఇప్పటివరకూ చెప్పిన కబుర్లు.. అవి ఎల్లో మీడియాలో వినీ.. వినీ.. ఎల్లో టీవీల్లో కనీ కనీ జనం కూడా సింగపూర్ నే తమ రాజధానిగా కలలు కన్నారు. 
 చంద్ర బాబు  సింగపూర్ కోసం చిత్ర ఫలితం
బాబు తమపై విపరీతంగా ఆధారపడ్డ విషయం అర్థం చేసుకున్నాయో ఏమో కానీ.. రాజధాని నిర్మాణానికి సవాలక్ష షరతులు పెడుతున్నాయి. ఆ షరతులు వింటే ఎవరికైనా కళ్లు తిరగడం ఖాయం.
jagan chandrababu comedy కోసం చిత్ర ఫలితం
ఆ షరతుల హైలెట్స్ ఏంటంటే.. సింగపూర్ కంపెనీలు కేవలం 300 కోట్లు మాత్రమే ఖర్చు పెడతాయట.  ఆ మాత్రం దానికి వాళ్లకి 4 వేల ఎకరాల భూమి అప్పజెప్పేయాలట. మామూలుగా కాదు.. ఇక ఆ భూమిని వాళ్లేం చేసుకున్నా అడగకూడదట. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ కూడా కావాలట. రాజధాని సెంటర్ పాయింట్ నుంచి పాతిక కిలోమీటర్ల మేర పోటీదార్లకు భూములివ్వకూడదట. 

చివరకు భూములిచ్చిన రైతులకు కూడా కోర్ కేపిటల్ బయటే స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశాయి. సింగపూర్ సర్కారు కంపెనీల డిమాండ్లతో ఏపీ సీఎం చంద్రబాబుకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయి ఉంటుందని పొలిటికల్ పండిట్స్ చెబుతున్నారు.