శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞాన అంశాలు?






శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞాన అంశాలు

brahmam gari vishwaroopam కోసం చిత్ర ఫలితం

>> బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది.
>> మాహాలక్ష్మమ్మ నృత్యంచేస్తూ వచ్చి మాయకోతులను ఆడిస్తుంది.
>> కృష్ణవేణి ఉప్పొంగి దుర్గమ్మ ముక్కుపుడక తాకుతుంది.
>> కంచి కామాక్షమ్మ కంట కన్నీరు కారుతుంది.
>> కుంభకోణంలోని ఆలయం కుప్పకూలుతుంది.
>> అచ్చమ్మ వంశం సర్వనాశనమై వారి వంశం అంతరించి పోతుంది.
>> నారాయణమ్మ వంశస్తులు మఠాధిపతులౌతారు. నీవు ఇకనైనా ఈ బ్రాంతిని విడిచిపెట్టు. అనిచెప్పి గోవిందమ్మ దు॰ఖాన్ని పోగొట్టాడు
>> క్రోధనామ సంవత్సరంలో మార్గశిర శుద్ధ పంచమి సోమవారంలో పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో వీరభోగ వసంతరాయుడిగా నేను వచ్చే సమయంలో దక్షిణాన వినాశనకరమైన గొప్ప నక్షత్రం ఉద్భవించి అందరికీ కనిపిస్తుంది.
>> చండిపూర్,అలంపూర్ స్థలములలో ఉత్పాతములు పుడతాయి. ఆ ప్రాంతంలో పాలెగాళ్ళు తమలో తాము కలహించుకుని చెడి భ్రష్టులై పోతారు.
>> నలు దిక్కులయందు దివ్యమైన నక్షత్రాలుపుట్టి కంటికి కనిపించి రాలిపోతాయి.
>> అమావాస్య రోజున పున్నమి చంద్రుని చూసిన జనులు నశిస్తారు. నిజమని నా మహిమను తలచుకుంటారు.కార్తీక శుద్ధ ద్వాదశినాటికి విష్ణుభక్తి పుడుతుంది. అప్పటికి సామవేద ఘోష వినిపిస్తుంది.
>> తూర్పున శిరసు పడమర తోకగా ఇరువది బారల ధూమకేతువనే నక్షత్రం పుడుతుంది. పుట్టిన ముప్పై రోజుల వరకు అందరికి కనిపిస్తుంది. ఆకాశం ఎర్రపడుతుంది. ఆవులు పైకి చూసి అరుస్తాయి. ఆకాశంలో శబ్ధాలు పుడతాయి.
నే>> ను చనిపోయేలోగానే హరిహరరాయలు మొదలు రామరాయల వరకు చరిత్ర అంతమౌతుంది.
>> ఆ తరువాతకాలంలో ఈ అఖండం మహమ్మదీయుల వశమౌతుంది.
>> శ్వేతముఖులు భరతఖండాన్ని పాలిస్తారు.
>> పల్నాటిసీమలో నరులు పచ్చి ఆకులు తిని జీవిస్తారు.
>> మొగలాయి రాజ్యాన ఒకనది పొంగి చేలు నాశనమైన రీతిగా జనాన్ని నశింపచేస్తుంది.
>> వ్యభిచార వృత్తి అంతరించి పోతుంది. ఆ వృత్తిలోని వారు వివాహం చేసుకుని కాపురం చేస్తారు.
>> గురువులు ఆడంబరంగా జీవిస్తారు.
>> కుటుంబంలో సఖ్యత ఉండదు. తల్లి, తండ్రి, పిల్లలు మధ్య వాత్సల్యాలు ఉండవు. ఒకరిని ఒకరు మీద ఒకరికి నమ్మకం నశిస్తుంది.
>> నారాకకు ముందు నా భక్తులు వారి శక్త్యానుసారం నాధ్ర్మ పాలనకు అంకురార్పణ చేస్తారు.
>> మహానందికి ఉత్తరాన అనేక మంది మునులు పుట్టుకు వస్తారు. భూమి మీద ఎన్నో మాయలు ప్రదర్శిస్తారు.
>> నేను వచ్చేసరికి బ్రాహ్మణులు వర్ణసంకర వృత్తులు చేస్తూ తమ వైభవం కోల్పోతారు. ఏ కులంవారు కూడా బ్రాహ్మణులను గౌరవించరు. సిద్దులూ యోగులూ జన్మించిన ఆ బ్రాహ్మణ కులం పూర్తిగా వర్ణసంకరమౌతుంది.
>> ఆనాటికి ప్రజలలో దుర్బుద్ధులు అధికమౌతాయి.
>> కృష్ణవేణమ్మ పొంగి కనకదుర్గమ్మ ముక్కు పుడకను తాకుతుంది.
>> రాజాధిరాజులు అణిగి ఉంటారు. శూద్రులు వలాసాలను అనుభవిస్తూ రాజుల హోదాలో ఉంటారు. వారి ఇంట ధనలక్ష్మీ నాట్యమాడుతుంది. నా భక్తులైన వారికి నేనప్పుడే దర్శనమిస్తాను. కానివారి నెత్తురు భూమి మీద పారుతుంది. దుర్మార్గుల రక్తంతో భూమి తడుస్తుంది. భూభారం కొంత తగ్గుతుంది.
>> చీమలుండు బెజ్జాల చోరులు దూరుతారు. స్త్రీలందరూ చెడుతలపుతో ఉంటారు. అందువలన చోరులు ప్రత్యేకంగా కనపడరు. బిలం నుండి మహానంది పర్వతం విడిచి వెళుతుంది. గడగ్ లక్ష్మీపురం, రాయచూర్, చంద్రగిరి అలిపేది, అరవరాజ్యం, వెలిగోడు, ఓరుగల్లు, గోలుకొంక్ల్డల్క్ల్క్ల్ మొదలైనవి అభివృద్ధి చెందుతాయి. నా మఠంలో ఏడుసార్లు దొంగలు పడతారు. క్షత్రియులు అంతరిస్తారు. చలననేంద్రియములు, ఆయుధాలచేత బాణముల వల్ల నశిస్తారు.
>> నాలుగు వర్ణాలు మద్యపానంతో భ్రష్టులౌతారు.
>> వేదములు అంత్య జాతుల పాలౌతాయి. విప్రులు కులహీనులై తక్కువ కులస్థుల పంచన చేరుతారు. విప్రులు విధవా వివాహాలు చేస్తారు. స్వవృత్తి, ధర్మాలు మాని ఇతరులకు బానిస వృత్తి చేస్తారు.
>> బ్రాహ్మణులను పిలిచేవారు ఉండరు. బ్రాహ్మణులు ఇతర విద్యల కోసం పంటభూములు అమ్ముకుంటారు. నేను వచ్చేసరికి వారికి తిండి గుడ్డ కరువు ఔతాయి. మీనరాశికి సూర్యుడు వచ్చే సమయంలో నేను వీరభోగ వసంత రాయలుగా ఉద్భవిస్తాను. నాలుగు మూరల ఖడ్గం చేత పట్టి శ్రీశైల పర్వతం మీదకు వచ్చి అక్కడి ధనం అంతా పుణ్యాత్ములైన వారికి దానం చేస్తాను.
>> నేను భూమి మీదకు ఎలా వస్తానో మరొకసారి చెప్తాను వినండి. కేదారి వనంలో నిరాహారినై జపము చేస్తాను. మూడు వరాలు పొంది అక్కడి నుండి విక్రమ నామ సంవత్సరం చైత్రశుద్ధ దశమి బుధవారం ఇంద్రకీలాద్రి పర్వతం చేరుకుని తపసు చేసి అక్కడ మహామునులను, మహర్షులను దర్శనం చేసుకుంటాను. అటు నుండి బయలుదేరి శ్రీశైలం మల్లిఖార్జునుని సేవించి దత్తాత్రేయుడిని దర్శనం చేసుకుంటాను. మహానందిలో రెండు రోజులుండి అక్కడి నుండి శ్రావణ శుద్ధ పౌర్ణమినాటికి నారాయణపురం చేరుకుని అక్కడ కొంతకాలం నివసిస్తాను.
>> నేను తిరిగి వచ్చేసరికి జనులు ధనమధాంధులు, అజ్ఞానులై కొట్టుకు చస్తారు.
>> నా రాకకు ముందు సముద్రంలోని జీవరాశులన్నీ నశిస్తాయి. పర్వతాలమీద జనులు బంగారు గనులు కనిపెట్టి బంగారం కోసం కొండలను పగుల కొడతారు.
>> కాశీదేశంలో కలహాలు చెలరేగుతాయి.
>> నేను వచ్చేసరికి విధవావివాహాలు జరగటం మామూలై పోతుంది.
>> వావి వరసలు లేకుండా వివాహాలు జరుగుతాయి. కుల గోత్రాలు నీతి జాతీ లేని పెళ్ళిళ్ళు జరుగుతాయి. పార్వతీ అవతారాలను డబ్బులకు అమ్ముకుంటారు.
>> అరణ్యంలోనూ భూమిలోనూ ధనం ఉండేను. నేను భూమిపై పెక్కు దృష్టాంతాలు పుట్టిస్తాను. పాతాళంలో నీరు ఇంకిపోతుంది. భూమిపై మంటలు పుడతాయి.
>> నాలుగు సముద్రాల మధ్య ఉన్న ధనమంతా శ్రీశైలం చేరుతుంది. నూట ఇరవై తిరపతులు పాడయ్యేను.
>> నా రాకకు ముందు అనేక చిత్రములు జరిగేను. శృంగేరి,పుష్పగిరి పీఠములు పంచాననం వారి పాలౌతాయి.
>> ఉత్తర దేశంలో కత్తులు తెగుతాయి. తూర్పు దేశం ధూళి అయిపోతుంది.
>> హరిద్వారంలోని మర్రి చెట్టుపై మహిమలు పుడతాయి. అక్కడి దేవాలయం తలుపులు మూసుకుంటాయి.
>> అహోబిలంలో ఉక్కు స్థంభానికి కొమ్మలు పుట్టి జాజిపూలు పూస్తాయి.
>> నా రాకకు ఇవే మీకు నిదర్శనాలు. నన్ను నమ్మిన వారికి నా రక్షణ కలుగుతుంది.
>> వైశాఖ శుద్ధ పంచమిన నేను బయలుదేరి సూర్యమండలం నుండి కొలువు పాకకు వస్తాను. అక్కడి నుండి అహోబిలం, తర్వాత సూర్యనంది చేరుకుంటాను.
>> శ్రీకృష్ణ నిర్యాణం ఆదిగా 4,999 సంవత్సరాలకు కలిరూపం కొంత నాశనం ఔతుంది.
>> శ్రీశైలాన పొగమంటలు పుడతాయి. బసవడు నాట్యమాడ 'గణ గణ'మని గంటలమోత వినబడుతుంది.
>> బ్రమరాంభ దేవాలయంలో ఒక ముసలి 7 రోజులుండి అదృశ్యం అవుతుంది. బ్రమరాంభ మెడలోని మంగళసూత్రాలు తెగి పడిపోతాయి. ఆమె కంట నీరు కారుతుంది. పాలిండ్లనుండి పాలుకారుతాయి.
>> కందనూరి గోపాలుని గుడి ముందు చింతచెట్టు పుడుతుంది. మహానందిలో ఈశ్వరుని విగ్రహం కదులుతుంది. దేవాలయంలో రెండు పాములు తిరుగుతాయి. వాటిలో పెద్ద పాము శిఖరాన మూడు రోజులుండి అదృశ్యమౌతుంది.
>> సూర్యనందీశ్వరుని ముందట పనసమాను పుడుతుంది. ఆ చెట్టు ఆ క్షణాన పూలుపూచి, కాయలుకాచి,పండ్లు పండి వెనువెంటనే మాయమౌతుంది.
>> శిరువెళ్ళ నరశింహుని దుట గంగిరావిచెట్టు మొలుస్తుంది. బహుధాన్య నామ సంవత్సర వైశాఖ శుద్ధ తదియ శుక్రవారం నాడు పల్లెకు తురకలు వస్తారు.
>> బసవన్న రంకె వేస్తాడు. తిరువళ్ళూరు వీరరాఘవస్వామికి చెమటలు పడతాయి. భద్రకాళి కంపస్తుంది. కంచి కామాక్షమ్మ దేహాన చెమట పడుతుంది. కంట నీరు,పాలిండ్ల పాలూ కారుతాయి.
>> శాలివాహన శకం 1541న ధూమకేతువు పుడుతుంది. 1555నాటికి వివిధ దేశాలలో జననష్టం కలుగుతుంది.
>> పెమ్మసాని తిమ్మన్న వంశం నిర్వంశమయ్యేను. ఉదయగిరి, నెల్లూరు రూపు మాసి పోయేను. గండికోట, గోలకొండ, ఆదలేని, కందనూరు పట్టణాలు నశించి తురకలు పారి పోతారు. విజయపురంలాంటి పట్టణాలు క్షయనామ సంవత్సరం నాటికి నశించేను.
>> స్త్రీల కంట నెత్తురు బిందువులు రాలుతాయి. వడగండ్ల వాన కురుస్తుంది. బాణవర్షం కురుస్తుంది. బావులూ, చెరువులూ, నదుల నీరు ఇంకినా జజ్జేరు నీరు మాత్రం ఇంకిపోదు
>> నేను శ్రీ వీరభోజ్యుడినై ఈ ప్రపంచంలో ఉద్భవిస్తాను. కలియుగం 5000 సంవత్సరములు గడిచిన తరువాత దుష్ట శిక్షణ శిష్ట రక్షనార్ధం వస్తాను. నేను వచ్చే ముందు సంభవించే పరిణామాలు విను.
>> ఉప్పుకొడూరులో ఊరచెరువులో ఉత్పాతాలు పుడతాయి. నిజాయితీతో వ్యాపారం చేసే వర్తకులు క్షీణించి పోతారు.
>> 14 నగరాలను జలప్రవాహాలు ముంచెత్తుతాయి. నేను రావటానికి ఇది ప్రబల నిదర్శనం.
>> నాలుగు వర్ణాల వారు గతి తప్పి నడుస్తారు. దేశంలో పెద్ద పొగమేఘం కమ్ముకుంటుంది. ప్రజలు దానిలో చిక్కుకుని మరణిస్తారు.
>> 5972 ధాతు నామ సంవత్సరాన మాఘ శుద్ధ బుధవారం రోజున పట్ట పగలే 18 పట్టణాలు దోపిడీకి గురౌతాయి.
>> కోటిదూపాటిలో కొచ్చర్లకోటలో కోడి మాట్లాడుతుంది. జనులలో అత్యధికులు ఇచ్చిన సొమ్ము దిగమ్రింగి అబద్ధాలాడి బాకీలు ఎగకొడతారు.
>> కోమటి కులంలో 25 గోత్రాలవారు మాత్రం మిగిలి ఉంటారు. ఉత్తర దేశంలో ఉత్తమ భేరీ కోమటి మహాత్ముడై నిలుస్తాడు. ఆ కోమటిని ప్రపంచమంతా కీర్తిస్తారు.
>> మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుంది.
>> పట్ట పగలు ఆకాశంలోనుండి పిడుగుల వాన పడి నిప్పుల వాన కురుస్తుంది. అందులో కొందరు మరణిస్తారు.
>> పంది కడుపున ఏనుగు పుడుతుంది. మేక కడుపున ఐదు తలల మేకపోతు పుడుతుంది.
>> బనగాన పల్లెలో కాలజ్ఞాన పాతర మీద వేపచెట్టుకు చేమంతిపూలు పూస్తాయి.
>> గుణవంతులందరూ బనగానపల్లె చేరుకుంటారు. బనగాన పల్లె నవాబు కొంతకాలం మాత్రమే పాలన చేస్తాడు.ఆ తరువాత బనగాన పల్లెను ఇతరరాజులు స్వాధీనపరచుకుంటారు.
>> అద్దంకి నాంచారమ్మ ముందుగా మాట్లాడుతుంది.అందువల్ల ఎందరో నష్టపోతారు.
>> గోలుకొండ నుంచి ఇద్దరు పిల్లలు పట్టణం ఏలుతారు.
>> మహానంది మరుగున మహిమలు పుడతాయి.
>> నేను రాబోయే ముందు ఒక చిత్రం జరుగుతుంది. దానిని గుర్తించిన వారిని నేను రక్షిస్తాను. నాలుగు నిలువుల ఎత్తుగల ఆజానుబాహువులు మేమే వీరభోజ వసంతరాయలమని చెబుతారు. నిజమైన భక్తులు ఈ మాటను నమ్మరు. మూఢులు మాత్రం నమ్ముతారు.
>> మరొక విచిత్రం పుడుతుంది. వీపున వింజామరలు అరికాలున తామరపద్మం కలిగినవారు వస్తారు. వారిని చూసి నేనని భ్రమపడవద్దు. నారాకకు గుర్తు ఏమిటంటే కందిమల్లయ పల్లెలో నవరత్న మండపం కడతారు. ఆ పల్లెపెరిగి పట్టణంగా మారుతుంది.
>> కంచి కామాక్షమ్మ కన్నులవెంట నీరు కారుతుంది. ఈ సంఘటన తరువాత వందలాది మంది మరణిస్తారు.
>> ఆవు కడుపులోని దూడ అదేవిధంగా బయటకు కనిపిస్తుంది.
>> పిల్లలు లేని స్త్రీలకు పిల్లలు పుడతారు.
>> కృష్ణ గోదావరుల మధ్య మహాదేవుడను పేర శైవుడు జన్మించి మతభేదం లేక గుడులూ గోపురాలు నిర్మించి పేరు ప్రఖ్యాతులు పొందుతాడు. ఊరూరా గ్రామ దేవతలు ఊగిసలాడతారు.
>> కాశీ కుంభకోణ గోకర్ణ క్షేత్రాల మహిమలు తగ్గి పోతాయి. కంచి మహత్యం మాత్రం పెరుగుతుంది.
>> ఆనంద నామ సంవత్సరాలు పదమూడు గడిచేవరకూ ఈ నిదర్శనాలు కనిపిస్తుంటాయి.
>> పతివ్రతలు పతితలౌతారు. వావి వరసలు పాటించకుండా ప్రవర్తిస్తారు. ఆచారాలన్నీ సమసి పోతాయి.
>> రాయలవారి సింహాసనం కంపిస్తుంది. కురుమ సంతతి రాజులందరినీ జయించి దక్షిణంగా బోయి రామేశ్వరం దిక్కున రాయల దళాలను తరిమి యుద్ధాలు చేసి నర్మదానదిలో కత్తులు కడిగి కాశీకి వచ్చి రాయల తల చూస్తారు. ఈ సమయంలో హస్థినాపురిలో మహామారి అనేశక్తి పుడుతుంది. రామేశ్వరం వరకు ప్రజలను నాశనం చేస్తుంది. రాయలు విజయనగరం పాలించే సమయంలో గజపతులతో పోరు జరుగుతుంది.
>> శ్రీశైల క్షేత్రాన కల్లు, చేపలు అమ్ముతారు. వేశ్యాగృహాలు వెలుస్తాయి. మందుమాకులకు లొంగని వ్యాధులు ప్రబలుతాయి. స్త్రీ పురుషులంతా దురాచార పరులౌతారు. స్త్రీలు భర్తలను దూషిస్తారు.
>> ఢిల్లీ ప్రభువు నశించిపోతాడు.
>> వైష్ణవ మతం పైకి వస్తుంది. శైవ మతం తగ్గి పోతుంది. నిప్పుల వాన కురుస్తుంది. గుండ్లు తేలుతాయి. బెండ్లు మునుగుతాయి. చివరకు శివశక్తి అంతా లేకుండా పోతుంది.
>> విజయనగరాన కోటలో రాయల సింహాసనం బయట పడుతుంది. ఇందుకు గుర్తుగా గ్రామంలో రాతి విగ్రహాలు ఊగిసలాడతాయి. అప్పుడు బిజ్జల రాయుని కొలువులో రాయలసింహాసనం బయట పడుతుంది.
>> విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతూ పగలు లేచి నిలబడుతుంది.అలా ఏడెనిమిది సంవత్సరాలు ఉండి ఆ చెట్టు నశిస్తుంది.అది మొదలు దేశంలో తీవ్రమైన కరువుకాటకాలు ఏర్పడతాయి.
>> ఈ కలియుగంలో 5097 సంవత్సరంలో ఎన్నో విశేషాలు జరుగుతాయి.ఆధాతృనామ సంవత్సరంలో అనేక ఊళ్ళలో రూపాయికి చిట్టెడు బియ్యం అమ్ముతారు.జనులు అరచి అరచి చస్తారు.
>> కలియుగం 5000 సంవత్సరాలు గడిచేసరికి గరిమిరెడ్డి అచ్చమ్మ వంశంలో ఎవరూ మిగలరు ఆ వంశానికి ఆస్తి అయిన గోవులలో ఒక్క గోవుకూడా మిగలదు.
>> బనగాన పల్లె నవాబు పాలనకూడా క్రమంగా నాశనమౌతుంది. అతనికి వచ్చే ఆదాయం క్షీణిస్తుంది
>> ఎంతో మందిమార్బలం ఉన్నా రాజులు సర్వనాశనమైపోతారు.గ్రామాలలో చోరులు పెరిగిపోతారు.
>> పిడుగులు పడి నదులు ఇంకిపోతాయి.
>> విచిత్ర వ్యాధులు పుట్టి ప్రజలు కూర్చున్నవారు కూర్చున్నట్లు నిలబడిన వారు నిలబడినట్లు మరణిస్తారు.
>> రాత్రింబవళ్ళు గద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తాయి. నీటిలోని చేపలు తామ చస్తామని పలుకుతూ వెలుపలికి వస్తాయి.
>> శ్రీశైల పర్వతానికి ఒక ముసలి వస్తుంది. అది భ్రమరాంబ గుడిలో దూరి ఎనిమిది రోజులుండి మేకలా కూసి మాయమౌతుంది.
>> శ్రీశైలంలో అగ్ని వర్షం పుడుతుంది. గుగ్గిళ్ళ బసవన్న(నందీశ్వరుడు)రంకెలు వేస్తాడు ఖణ ఖణమని కాలు దువ్వుతాడు.
>> సూర్యమండలం నుండి మాటల రూపంలో శబ్దం వినపడుతుంది.
>> విషవాయువు కొట్టినప్పుడు శివునికంట నీరు కారుతుంది.
>> గ్రామాలలో పట్టణాలలో నెత్తుటి వానకురుస్తుంది.
>> సూర్య్డు చంద్రుడు ఉన్నంతకాలం నా మఠానికి పూజలు జరుగుతాయి. నా మఠానికి ఈశాన్యంలో ఒక చిన్నదానికి ఒక చిన్నవాడు పుడతాడు. అతడు నేనే దేవుడినని నన్ను పూజించండి అని పలుకుతాడు.
>> నెల్లూరు సీమ మొత్తం నీట మునుగుతుంది.
>> వేశ్యల వలన ప్రజలు భయంకర రోగాలకు గురి ఔతారు. మనుషులు వావి వరసలు లేకుండా ప్రవర్తిస్తారు వారికి డబ్బే ప్రధానం ఔతుంది.
>> రాజులు తమ ధర్మాన్ని మరచి విందులూ వినోదాలలో మునిగి ధర్మ భ్రష్టూలౌతారు.
>> శాంతమూర్తులకు కూడా కోపం విపరీతంగా వస్తుంది. వివిధ వర్ణాల వారు తమ ధర్మం వదిలి ఇతర ధర్మాలను ఆచరించి నాశనం ఔతారు.
>> పంటలు సరిగా పండక పాడి పశువులు సరిగా పాలివ్వక భయంకరమైన కరువు సంప్రాప్తిస్తుంది.
>> బ్రాహ్మణులు తమ ధర్మాలను వదిలి ఇతర కర్మలను ఆచరించటం వలన దేశం కల్లోలితమౌతుంది.
>> చోళమండలం నష్టాలపాలౌతుంది.
>> వావి వరసలు గౌరవ మర్యాదలు క్షీణించి తండ్రి కొడుకును కొడుకు తండ్రిని దూషిస్తారు.
>> ప్రజలు కొరువులను నోట పెట్టుకుని తిరుగుతారు.కొడలు మండుతాయి.
>> జనుల కడుపులో మంటలు పుడతాయి. నోటిలో బొబ్బలు లేస్తాయి. నెత్తురు కక్కుతూ, రోగాల పాలై జనులు మరణిస్తారు. జంతువులూ అలాగే చస్తాయి.
>> దుర్మార్గులు రాజులౌతారు. మంచి ప్రవర్తాన కలవారు భయంకర కష్టాలపాలై హీనంగా మరణిస్తారు.
>> మతకలహాలు పెరిగి ఒకరిని ఒకరు చంపుకుంటారు.
>> అడవి మృగాలు గ్రామాలు పట్టణాలలో ప్రవేశించి మానవులను చంపుతాయి.
>> నీళ్ళతో దీపాలను వెలిగిస్తారు.
>> ఇతర దేశస్తులు భారతదేశాన్ని పాలిస్తారు.
>> మాచర్లలో రాజులంతా ఒక స్త్రీ వలన కలహించుకుని మరణిస్తారు.
>> పట్టపగలే చుక్కలు కనిపించి కొంతమంది ప్రజల మరణానికి హేతువౌతాయి.
>> ఒకరి భార్యను ఒకరు వశపరచుకుంటారు. స్త్రీ పురుషులిర్వురూ కామపీడితులౌతారు.
>> వేంకటేశ్వర క్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయి. మహమ్మదీయులు దేవాలయాన్ని దోచుకుంటారు.
>> ఐదువేల ఏళ్ళ తరువాత కాశీలో గంగ కనిపింకుండా మాయమై పోతుంది.
>> చెన్నకేశవ స్వామి మహిమలు నాశనమౌతాయి.
>> కృష్ణానది మధ్య బంగారు తేరు పుడుతుంది. అది చూసినవారికి కండ్లు పోతాయి.
>> ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య క్షీణిస్తుంది.
>> ఐదువేల ఏళ్ళ తరువాత నేను వీరభోగ వసంతరాయలుగా అవతరించి ధ్ర్మాత్ములను కాపాడి పాపాత్ములను శిక్షిస్తాను. నా భక్తులు తిరిగి నన్ను చేరుకుంటారు.
>> వెంకటేశ్వరునికి మహమ్మదీయులు కూడా పూజలు చేస్తారు.
>> కృష్ణా గోదావరి మధ్య పశువులు కూడి మరణిస్తాయి.
>> తూర్పు నుండి పడమరకు ఒక యోజనము ప్రమాణం వెడల్పుగా ఆకాశంలో చెంగావి చీర కట్టినట్లు కనపడుతుంది.
>> నీళ్ళతో దీపాలు వెలిగిస్తారు (విద్యుత్ శక్తి) (నీటీతొ జనరేటరు)
>> ఎద్దులు లేకుండానే బళ్ళు నడుస్తాయి. (యంత్ర వాహనాలు)
>> కాశీ పట్నం 40 రోజుల పాటు పాడుబడుతుంది.
>> ఒక అంబ (వితంతువు) 16 సంవత్సరాలు రాజ్యమేలుతుంది. (ఇందిరా గాంథి)
>> తెరమీది బొమ్మలు గద్దెలెక్కుతారు. రంగులు చూసి ప్రజలు మోసపోతారు. (ఎన్.టి.ఆర్, జయలలిత, తదితరులు. చలన చిత్రాలు)
>> రాచరికాలు,రాజుల పాలనా నశిస్తాయి.(ప్రజా ప్రభుత్వాలు)
>> ఆకాశాన పక్షివాహనాలు కూలి అనేకమంది మరణిస్తారు. (విమాన ప్రమాదాలు)
>> జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది.
>> బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి.
>> హైదరాబాదులో తురకలు హిందువులు ఒకరిని ఒకరు నరుక్కుని చనిపోతారు. (మత కలహాలు)
>> దేవస్థానాలు పాపాత్ముల వలన నాశనమౌతాయి. దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయి.
>> చిత్రవిచిత్రమైన యంత్రాలు వస్తాయి. కానీ చావుపుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు. సృష్టిని మార్చటానికి అనేక ప్రయత్నాలు చేస్తారు.
>> రావణ కాష్టాన కల్లోలములు రేగి దేశాన్ని అల్లకల్లోల పరుస్తాయి.(శ్రీలంకలోని తీవ్రవాద పణామాలు)
>> గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడు.(లాల్ బహుద్దూర్ శాస్త్రి)
>> కపట యోగులు విపరీతంగా పెరిగి పోతారు. వీరివలన ప్రజలంతా మోసపోతారు.
>> అడవి మృగాలు గ్రామాలు పట్టణాలలో ప్రవేశించి మానవులను చంపుతాయి.