ఐశ్వర్య ప్రాప్తికి ఇలా చేయండి ?




సకల ఐశ్వర్య ప్రాప్తికి ఇలా చేయండి 



"డబ్బు లేదు" , " కీర్తి లేదు", "ఆరోగ్యం లేదు", "ఉద్యోగం లేదు", "ప్రమోషన్ లేదు", " విజయం లేదు", "ఆధ్యాత్మిక చింతన లేదు" ఇలా ఏదైనా లేదు అనుకోవడమే దారిద్ర్యం. వీటిలో ఏది తొలగడానికైనా పారాయణ చేయాలి.

"ప్రకృతి వికృతిం విద్యం " అంటూ ప్రారంభమయ్యే లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం చాలా ప్రధానమైనది. దీనిని ప్రతినిత్యము మూడు పూటల ఇంద్రియ నియమంతో 6 నెలలు పారాయణ చేస్తే సకల విధములైన లేములు తొలిగిపోతాయి. అందుకే దీనిని "దారిద్ర్యమోచన " స్తోత్రం అంటారు. ఒక సంవత్సర కాలం పాటు నియమాలతో ప్రతి శుక్రవారం 108 పర్యాయాలు పఠిస్తే అన్ని ఐశ్వర్యాలు వరిస్తాయి. శివుడు పార్వతికి ఉపదేశించిన మంత్రమిది.