తలుపుల రెక్కలు ఎన్ని ఉండాలి ?




తలుపుల రెక్కలు  ఎన్ని ఉండాలి ?



ఎన్నివున్నా ఏమి తిన్నా మన్నులోనికి ప్రయాణం
కన్నులకు పొరలెక్కి తిరిగితే లెక్క చేయదు ప్రకృతి
రాజుకైనా, పేదకైనా మంచి ఒకటే ప్రమాణం
మనిషి జాతికి మంచి నొసగుటె వాస్తు నిర్మిత ప్రధానం!


ఈ విషయం భద్రతకు సంబంధించింది. అపార్ట్‌మెంట్‌ల నిర్మాణాలు వచ్చినప్పటి నుంచి ఒక్క రెక్క తలుపులు పుట్టుకొచ్చాయి. రెండు తలుపులు చిన్న గృహాలకు ఒదిగినట్టుగా ఉంటాయి. అంటే గృహస్థలం తక్కువగా ఉన్నప్పుడు గుమ్మాల దగ్గర తలుపులు తీసి పెట్టినప్పుడు అవి అటు ఇటు కదులుతున్నప్పుడు వాడుకునే స్థలం తక్కువగా ఉంటుంది. పెద్ద రెక్కలు పెట్టినప్పుడు దాని వాడుక స్థలం ఎక్కువగా ఉంటుంది. ‘ఇవి ఏవి ఎక్కడ పెట్టాలి?’ అనేది ఆయా స్థలాలను బట్టి నిర్ణయం తీసుకోవాలి. హాలుకు వచ్చే తలుపునకు రెండు రెక్కలు పెట్టడం మంచిది. డ్రాయింగ్ రూమ్‌కు వచ్చే తలుపులకు ఒక్క రెక్క పెట్టడం మంచిది. ఒకే రెక్క పెట్టే చోట ఆ డోరు ఒక గోడవైపు రెస్ట్ అయ్యేలా చూసుకోవాలి. ఇంటి నిర్మాణంలో ప్రతి అంశం ప్రధానమే. ప్రతి గృహ వసతిలో వ్యత్యాసాలు ఉండవు.