>>అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు
>>అంబలి తాగే వారికి మీసాలు యెగబట్టేవారు కొందరా
>>అతి రహస్యం బట్టబయలు
>>అడిగేవాడికి చెప్పేవాడు లోకువ
>>అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు
>>అనువు గాని చోట అధికులమనరాదు
>>అభ్యాసం కూసు విద్య
>>అమ్మబోతే అడివి కొనబోతే కొరివి
>>అయితే ఆదివారం కాకుంటే సోమవారం
>>ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం
>>అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అట
>>అంగడినుంచి తెచ్చే ముందర పెట్టుక ఏడ్చే
>>అంతనాడు లేదు, ఇంతనాడు లేదు,సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు
>>అంత్య నిష్టూరం కన్నా, ఆది నిష్టూరం మేలు
>>అంబరాన బిడ్డ పుడితే ఆముదం పెట్టి ముడ్డి కడిగిందట
>> అందని పండ్లకు అర్రులు చాచినట్లు
>>అందని ద్రాక్షలు పుల్లన
>>అందితే సిగ అందకపోతే కాళ్ళు
>>అంబలి తాగేవాడికి మీసాలు ఎత్తేవాడు
>> అందరూ శ్రీ వైష్ణవులే బుట్టలో చేపలన్నీ మాయం
>>అంధుడికి అద్దం చూపించినట్లు
>>అక్కర ఉన్నంతవరకు ఆదినారాయణ, అక్కర తీరేక గూదనారాయణ
>>అగడ్తలో పడ్డ పిల్లికి అదే వైకుంఠం
>>అగ్నికి వాయువు తోడైనట్లు
>>అటునుండి నరుక్కు రా
>>అడకత్తెరలో పోకచెక్క
>> అడగందే అమ్మ అయినా పెట్టదు
>>అడగందే అమ్మైనా (అన్నం) పెట్టదు
>>అడిగేవాడికి చేప్పేవాడు లోకువ
>> అడుక్కునేవాడికి అరవైఆరు కూరలు
>>అడుక్కునేవాడిదగ్గర గీక్కునేవాడు
>>అడుసు తొక్కనేల కాలు కడగనేల
>>అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదు
>> అతని కంటె ఘనుడు ఆచంట మల్లన్న
>>అతి వినయం ధూర్త లక్షణం
>>అతిరహస్యం బట్టబయలు
>> అత్త సొమ్ము అల్లుడు దానం
>>అత్తమీద కోపం దుత్తమీద తీర్చుకున్నట్లు.
>> అత్తరు పన్నీరు గురుగురులు దాని దగ్గరకు పోతే లబలబలు
>> అత్తలేని కోడలు ఉత్తమురాలు కోడలు లేని అత్త గుణవంతురాలు
>> అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు
>> అదిగో తెల్లకాకి అంటే ఇదిగో పిల్ల కాకి అన్నట్లు
>> అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు
>> అద్దం అబద్దం ఆడుతుందా !
>>అనగా అనగా రాగం తినగా తినగా రోగం
>>అనుమానం పెనుభూతం
>> అన్నవస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడిపోయాయట
>> అన్నవారు బాగున్నారు, పడినవారు బాగున్నారు మధ్యనున్న వారే నలిగిపోయారన్నట్లు
>> అన్నిదానాల్లోకి నిదానమే గొప్పదన్నాడట
>>అన్నం పెట్టేవాడు దగ్గరుండాలి దణ్ణం పెట్టేవాడు దూరంగా ఉన్నా పర్వాలేదు
>>అన్నం చొరవే గానీ అక్షరం చొరవ లేదు
>> అన్నీ ఉన్న ఆకు అణగి మణగి ఉంటుంది. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది
>> అన్నీ సాగితే రోగంమంత భోగము లేదు
>> అపానవాయువును అణిచిపెడితే ఆవులింతలు ఆగుతాయా?
>> అప్పటికి దుప్పటిచ్చాముగానీ కలకాలం ఇస్తామా?
>>అప్పనుచూడబోతే రెప్పలు పోయినై
>> అప్ప సిరిచూసుకొని మాచి మడమలు తొక్కింది
>>అక్కా పప్పు వండవే చెడేవాడు బావ ఉన్నాడు గదా?
>> అప్పిచ్చువాడు వైద్యుడు
>> అప్పిచ్చి చూడు ఆడపిల్లనిచ్చిచూడు
>>అప్పు నిప్పులాంటిది...
>>అప్పు పత్రానికి ఆన్సరుందిగానీ చేబదులుకి ఉందా?
>> అప్పు చేసి కొప్పు తీర్చిందట
>> అప్పుచేసి పప్పు కూడు
>> అప్పులేని వాడే అథిక సంపన్నుడు
>> అప్పులవాడిని నమ్ముకొని అంగడికి, మిండమగడిని నమ్ముకొని జాతరకు పోకూడదు
>> అప్పులున్నాడితోను చెప్పులున్నాడితోను నడవొద్దు
>>అబద్ధము ఆడితే అతికినట్లుండాలి
>>అభ్యాసము కూసువిద్య
>>అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా?
>> అమ్మ పెట్టా పెట్టదు,అడుక్కు తినా తిననివ్వదు
>>అమ్మకి కూడు పెట్టనివాడు, పెద్దమ్మకి కోక పెడతానన్నాడు
>>అమ్మబోతే అడవి కొనబోతే కొరివి
>>అయితే అంగలూరు కాకపోతే సింగలూరు
>> అయిదుగురు పట్టంగ ముఫ్పై ఇద్దరు రుబ్బంగ ఒకడు తొయ్యంగ
గుండువెళ్ళి గుండావతిలో పడింది
గుండువెళ్ళి గుండావతిలో పడింది
>> అయిదోతనం లేని అందం అడుక్కుతిననా?
>> అయినోళ్లకి ఆకుల్లో, కానోళ్ళకి కంచంలో
>>అయిపోయిన పెళ్ళికి మేళాలెందుకు
>> అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారన్నట్టు
>>అరఘడియ భోగం ఆర్నెల్ల రోగం
>>అరచేతిలో వైకుంఠం చూపినట్లు
>>అవ్వాకావలెను బువ్వా కావలెను
>> అరచేతిలో వెన్నపెట్టుకొని నెయ్యికోసం వూరంతా తిరిగినట్లు...
>> అరిచే కుక్క కరవదు
>>అరటిపండు ఒలచి చేతిలొ పెట్టినట్ట్లు
>> అర్దరాత్రి మద్దెల దరువు
>> అలకాపురికి రాజైతే మాత్రం అమితంగా ఖర్చు చేస్తాడా...
>>అలిగే బిడ్డతో చెలిగే గొడ్డుతో వేగడం కష్టం
>> అల్లం అంటే నాకు తెలీదా బెల్లంలా పుల్లగా ఉంటదన్నాడట
>>అసలు లేవురా మగడా అంటే పెసరపప్పు వండవే పెళ్ళామా అన్నాడట
>>అసలే కోతి,ఆపై కల్లు తాగినట్టు
>> అసలే లేదంటే పెసరపప్పు వండవే పెళ్ళామా అన్నాడట
>>ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత
>>ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు
>>ఇంట గెలిచి రచ్చ గెలువు
>>ఇల్లు పీకి పందిరేసినట్టు
>>ఎనుబోతు మీద వాన కురిసినట్టు
>>చెవిటి వాని ముందు శంఖమూదినట్టు
>>కందకు లేని దురద కత్తిపీటకెందుకు
>>కత్తిపోటు తప్పినాక కలంపోటు తప్పదు
>>కుక్క కాటుకు చెప్పుదెబ్బ
>>కోటి విద్యలు కూటి కొరకే
>>నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు
>>పిచ్చుకపై బ్రహ్మాస్త్రం
>>పిట్ట కొంచెము కూత ఘనము
>>రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు
>>వాన రాకడ ప్రాణపోకడ
>>కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదు
>>మీసాలకు సంపంగి నూనె
>> ఆ మొద్దు లొదే ఈ పేడు
>> ఆ తాను ముక్కే !!!
>> ఆడబోయిన తీర్థము యెదురైనట్లు
>>ఆడలేక మద్దెల వోడు అన్నట్లు
>> ఆది లొనే హంస పాదు
>> ఏమీ లేని యెడారిలో ఆముదము చెట్టే మహా వృక్షము
>> ఆకలి రుచి యెరుగదు, నిద్ర సుఖమెరుగదు
>>ఆకాశానికి హద్దే లేదు
>> ఆలస్యం అమృతం విషం
>> ఆరే దీపానికి వెలుగు యెక్కువ
>> ఆరోగ్యమే మహాభాగ్యము
>>ఆత్రానికి బుద్ధి మట్టు
>>ఆవులింతకు అన్న ఉన్నాడు కాని, తుమ్ముకు తమ్ముడు లేడంట
>>ఆవు చేను మేస్తే, దూడ గట్టు మేస్తుందా?
>> అబద్ధము ఆడినా అతికినట్లు ఉండాలి
>>అడగందే అమ్మైనా అన్నమ్ పెట్టదు
>> అడ్డాల నాడు బిడ్డలు కాని, గడ్డాల నాడు కాదు
>>ఏ ఎండకు ఆ గొడుగు
>>అగడ్తలొ పడ్డ పిల్లికి అదే వైకున్ఠం
>>అగ్నికి వాయువు తొడైనట్లు
>>ఐశ్వర్యమొస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమనేవాడు
>> అందని మ్రానిపండ్లకు అర్రులు చాచుట
>> అందితే జుట్టు అందక పోతే కాళ్ళు
>> అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని ఉన్నట్లు
>> అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేధు
>>అప్పు చేసి పప్పు కూడు
>> అయ్య వచే వరకు అమావాస్య ఆగుతుందా
>>అయ్యవారిని చెయ్యబొతే కోతి బొమ్మ అయినట్లు
>>బతికుంటే బలుసాకు తినవచ్చు
>>బెల్లం కొట్టిన రాయిలా
>>భక్తి లేని పూజ పత్రి చేటు
>>బూడిదలో పోసిన పన్నీరు
>>చాదస్తపు మొగుడు చెబితే వినడు, గిల్లితే యేడుస్తాడు
>> చాప కింద నీరులా
>> చచ్చినవాని కండ్లు చారెడు
>> చదివేస్తే ఉన్నమతి పోయినట్లు
>>విద్య లేని వాడు వింత పశువు
>>చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ
>> చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు
>>చక్కనమ్మ చిక్కినా అందమే
>> చెడపకురా చెడేవు
>>చీకటి కొన్నాళ్ళు, వెలుగు కొన్నాళ్ళు
>>చెరువుకి నీటి ఆశ, నీటికి చెరువు ఆశ
>> చింత చచ్చినా పులుపు చావ లేదు
>> చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే, ఆ వంకర
టింకరవి యేమి కాయలని అడిగిందట
టింకరవి యేమి కాయలని అడిగిందట
>> చిలికి చిలికి గాలివాన అయినట్లు
>>డబ్బుకు లోకం దాసోహం
>>దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు
>> దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన
>> దాసుని తప్పు దండంతో సరి
>> దెయ్యాలు వేదాలు పలికినట్లు
>>దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు
>>దొంగకు దొంగ బుద్ధి, దొరకు దొర బుద్ధి
>> దొంగకు తేలు కుట్టినట్లు
>>దూరపు కొండలు నునుపు
>>దున్నపోతు మీద వర్షం కురిసినట్లు
>>దురాశ దుఃఖమునకు చెటు
>>ఈతకు మించిన లోతే లేదు
>> ఎవరికి వారే యమునా తీరే
>> ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు
>> గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె అందానికి గాడిద
మూర్ఛ పోయిందంట
మూర్ఛ పోయిందంట
>>గాజుల బేరం భోజనానికి సరి
>>గంతకు తగ్గ బొంత
>>గతి లేనమ్మకు గంజే పానకము
>>గోరు చుట్టు మీద రోకలి పోటు
>> గొంతెమ్మ కోరికలు
>>గుడ్డి కన్నా మెల్ల మేలు
>>గుడ్డి యెద్దు జొన్న చేలో పడినట్లు
>> గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు
>> గుడి మింగే వాడికి నంది పిండీమిరియం
>>గుడినీ గుడిలో లింగాన్నీ మింగినట్లు
>> గుడ్ల మీద కోడిపెట్ట వలే
>>గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నాడట
>>గుర్రము గుడ్డిదైనా దానాలో తక్కువ లేదు
>>గురువుకు పంగనామాలు పెట్టినట్లు
>>తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు
>>ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు
>>ఇంటి పేరు కస్తూరివారు వీధిలో గబ్బిలాల కంపు
>>ఇంటికన్న గుడి పదిలం
>>ఇసుక తక్కెడ పేడ తక్కెడ
>>జోగి జోగి రాజుకుంటే బూడిద రాలిందంట
>>కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు
>> కాగల కార్యము గంధర్వులే తీర్చినట్లు
>> కాకి ముక్కుకు దొండ పండు
>> కాకి పిల్ల కాకికి ముద్దు
>> కాలం కలిసి రాక పోతే కర్రే పామై కాటు వేస్తుంది
>> కాలు జారితే తీసుకోగలము కాని నోరు జారితే తీసుకోగలమా
>> కాసుంటే మార్గముంటుంది
>> కడుపు చించుకుంటే కాళ్ళపైన పడ్డట్లు
>> కలకాలపు దొంగ ఒకనాడు దొరుకును
>>కలిమి లేములు కావడి కుండలు
>> కలిసి వచ్చే కాలం వస్తే, నడిచి వచ్చే కొడుకు పుదతాదు
>>కంచే చేను మేసినట్లు
>> కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా!
>> కందకు కత్తి పీట లోకువ
>>కందెన వేయని బండికి కావలసినంత సంగీతం
>> కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం
>> కీడెంచి మేలెంచమన్నారు
>> కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడినట్లు
>>కొండల్లే వచ్చిన ఆపద కూడా మంచువలే కరిగినట్లు
>> కొండను తవ్వి యెలుకను పట్టినట్లు
>> కొన్న దగ్గిర కొసరు గాని కోరిన దగ్గర కొసరా
>>కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచిందిట
>> కూటికి పేదైతే కులానికి పేదా
>> కొరివితో తల గోక్కున్నట్లు
>> కోతి పుండు బ్రహ్మాండం
>> కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లు
>>కొత్తొక వింత పాతొక రోత
>> కోతి విద్యలు కూటి కొరకే
>> కొత్త అప్పుకు పొతే పాత అప్పు బయటపడ్డదట
>> కొత్త బిచ్చగాడు పొద్దు యెరగడు
>> కృషితో నాస్తి దుర్భిక్షం
>>క్షేత్ర మెరిగి విత్తనము పాత్ర మెరిగి దానము
>>కుడుము చేతికిస్తే పండగ అనేవాడు
>> కుక్క వస్తే రాయి దొరకదు రాయి దొరికితే కుక్క రాదు
>> లేని దాత కంటే ఉన్న లోభి నయం
>> లోగుట్టు పెరుమాళ్ళకెరుక
>>మెరిసేదంతా బంగారం కాదు
>> మంచమున్నంత వరకు కాళ్ళు చాచుకో
>>నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది
>>మంది యెక్కువయితే మజ్జిగ పలచన అయినట్లు
>>మనిషి మర్మము మాను చేవ బయటకు తెలియవు
>> మనిషి పేద అయితే మాటకు పేదా
>>మనిషికి మాటే అలంకారం
>>మనిషికొక మాట పశువుకొక దెబ్బ
>>మనిషికొక తెగులు మహిలో వేమా అన్నారు
>>మంత్రాలకు చింతకాయలు రాల్తాయా
>> మీ బోడి సంపాదనకు ఇద్దరు పెళ్ళాలా
>>మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అయ్యిందట
>>మొక్కై వంగనిది మానై వంగునా
>> మొరిగే కుక్క కరవదు
>> మొసేవానికి తెలుసు కావడి బరువు
>>ముల్లును ముల్లుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతొనే కొయ్యాలి
>>ముండా కాదు ముత్తైదువా కాదు
>> ముందర కాళ్ళకి బంధాలు వేసినట్లు
>> ముందుకు పోతే గొయ్యి వెనుకకు పోతే నుయ్యి
>>ముంజేతి కంకణముకు అద్దము యెందుకు
>>నడమంత్రపు సిరి నరాల మీద పుండు
>>నేతి బీరకాయలో నెయ్యి యెంత ఉందో నీ మాటలో అంతే నిజం ఉంది
>>నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా
>>నవ్వు నాలుగు విధాలా చేటు
>>నీ చెవులకు రాగి పొగులే అంటే అవీ నీకు లేవే అన్నట్లు
>>నిదానమే ప్రధానము
>>నిజం నిప్పు లాంటిది
>> నిమ్మకు నీరెత్తినట్లు
>>నిండు కుండ తొణకదు
>> నిప్పు ముట్టనిది చేయి కాలదు
>> నూరు గొడ్లు తిన్న రాబందుకైనా ఒకటే గాలిపెట్టు
>>నూరు గుర్రాలకు అధికారి ఐనా భార్యకు యెండు పూరి
>>నెల్లాళ్ళు సావాసం చేస్తే వారు వీరు అవుతారు
>>ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు
>>ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బ్రతకవచ్చు
>>బతికి ఉంటే బలుసాకు తినవచ్చు
>> ఊరంతా చుట్టాలు ఉత్తికట్ట తావు లేదు
>>ఊరు మొహం గోడలు చెపుతాయి
>>పాకి దానితొ సరసమ్ కంటే అత్తరు సాయిబు తో కలహం మేలు
>> పాము కాళ్ళు పామునకెరుక
>> పానకంలో పుడక
>>పాపమని పాత చీర ఇస్తే గోడ చాటుకు వెళ్ళి మూర వేసిందట
>> పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకం అంతా పచ్చగా కనపడినట్లు
>>పండిత పుత్రః శుంఠ
>>పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్లు
>> పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు
>> పట్టి పట్టి పంగనామం పెడితే గోడ చాటుకు వెళ్ళి చెరిపి వేసుకున్నాడట
>>పెదిమ దాటితే పృథివి దాటును
>>పెళ్ళంటే నూరేళ్ళ పంట
>>పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకు వెళ్ళినట్టు
>>పేనుకు పెత్తనమిస్తే తల అంతా కొరికిందట
>>పెరుగు తోట కూరలో పెరుగు యెంత ఉందో నీ మాటలో అంతే నిజం ఉంది
>> పిచ్చి కోతికి తేలు కుట్టినట్లు
>>పిచ్చోడి చేతిలో రాయిలా
>>పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా
>>పిల్లికి చెలగాటం యెలుకకు ప్రాణ సంకటం
>> పిండి కొద్దీ రొట్టె
>>పిట్ట కొంచెము కూత ఘనము
>>పోరు నష్టము పొందు లాభము
>>పోరాని చోట్లకు పోతే రారాని మాటలు రాకపోవు
>>పొర్లించి పొర్లించి కొట్టిన మీసాలకు మన్ను కాలేదన్నదట
>>పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు
>> పువ్వు పుట్టగానే పరిమళించినట్లు
>>రాజు గారి దివాణంలో చాకలోడి పెత్తనము
>>రామాయణంలో పిడకల వేట
>>రమాయణం అంతా విని రాముడికి సీత యేమౌతుంది అని అడిగినట్టు
>>రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలనట్లు
>>రెడ్డి వచ్చే మొదలు పెట్టు అన్నట్టు
>> రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు
>>రౌతు కొద్దీ గుర్రము
>>ఋణ శేషం శత్రు శేషం ఉంచరాదు
>>చంకలో పిల్లవాడిని ఉంచుకుని ఊరంతా వెతికినట్టు
>> సంతొషమే సగం బలం
>>సిగ్గు విడిస్తే శ్రీరంగమే
>>సింగడు అద్దంకి పోనూ పొయ్యాడు రానూ వచ్చాడు
>> శివుని ఆజ్ఞ లేక చీమైనా కుట్టదు
>>శుభం పలకరా యెంకన్నా అంటే పెళ్ళి కూతురు ముండ ఎక్కడ అన్నాడంట!
>> శ్వాస ఉండేవరకు ఆశ ఉంటుంది
>>తాచెడ్డ కోతి వనమెల్ల చెరిచిందట
>>తాడి తన్ను వాని తల తన్నేవాడు ఉంటాడు
>>తాళిబొట్టు బలం వల్ల తలంబ్రాల వరకు బతికాడు
>>తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు
>>తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదురుతాయా
>> తాతకు దగ్గులు నేర్పినట్టు
>>తేలుకు పెత్తనమిస్తే తెల్లవార్లూ కుట్టిందట
>> తన కోపమే తన శత్రువు
>>తన్ను మాలిన ధర్మము మొదలు చెడ్డ బేరము
>> తంతే గారెల బుట్టలో పడ్డట్లు
>>తప్పులు వెదికే వాడు తండ్రి ఒప్పులు వెదికేవాడు వోర్వలేనివాడు
>>తీగ లాగితే డొంక అంతా కదిలినట్లు
>> తెగేదాక లాగవద్దు
>> తిక్కలోడు తిరణాళ్ళకు వెలితే ఎక్కా దిగా సరిపొయిందంట
>> తినే ముందు రుచి అడుగకు వినే ముందు కథ అడుగకు
>>తినగా తినగా గారెలు చేదు
>> తింటే గారెలు తినాలి వింటే భారతం వినాలి
>> తియ్యటి తేనె నిండిన నోటితోనే తేనెటీగ కుట్టేది
>>ఉల్లి చేసిన మేలు తల్లి కూడ చేయదు
>>ఉపకారానికి పోతే అపకారమెదురైనట్లు
>>ఉరుము ఉరుమి మంగళం మీద పడ్డట్టు
>> ఉత్తికెక్కలేనమ్మ స్వర్గానికెక్కినట్టు
>>వాపును చూసి బలము అనుకున్నాడట
>>వీపుమీద కొట్టవచ్చు కాని కడుపు మీద కొట్టరాదు
>> వెర్రి వెయ్యి విధాలు
>>వినాశకాలే విపరీత బుద్ధి
>>యే ఎండకు ఆ గొడుగు
>> యే గాలికి ఆ చాప
>> యెద్దు పుండు కాకికి ముద్దు
>> యేకులు పెడితే బుట్టలు చిరుగునా
>> యెక్కడైనా బావ కానీ వంగ తోట దగ్గర మాత్రం కాదు
>>యెప్పుడూ ఆడంబరంగా పలికే వాడు అల్పుడు
ఇంకా :