మానవ జీవం, మానసిక పరిస్థితి ప్రధానంగా వారి వారి గ్రహలస్థితిపై
ఆధారపడి వుంటుందని జ్యోతిష్క శాస్త్రం చెబుతోంది. గ్రహస్థితిలో మార్పులు వల్లనే ఎవరి జీవితంలో అయినా ఒడిదుడుకులు ఎదురవ్వడం గానీ, లాభాలు, సంతోషాలు కలిసిరావడం గానీ వస్తుంటాయి. వాటిని బట్టే మానసిక పరిస్థితి, ఆరోగ్యం ఆధారపడి వున్నాయి. |
నగ్రహ ప్రదక్షిణ మనిషి కష్టనష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటుంది.
నవగ్రహ ప్రదక్షిణలకు ఒక నిర్దిష్టమైన పద్ధతి వుంది. ఆ పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. చాలామందికి ఈ పద్దతులు గురించి అవగాహన వుండదు. అవి తెలుసుకోవడం ఎంతైనా అవసరం. |
నవగ్రహ ప్రదక్షిణ సమయంలో తీసుకోవలసిన మెలకువలు |
సాధారణంగా నవగ్రహాలలో సూర్యుడి విగ్రహం మధ్యలో తూర్పు దిక్కున
వుంటుంది. ఆలయంలోకి ప్రవేశించే వారు సూర్యుడిని చూస్తూ లోపలికి వెళ్లి ఎడమ వైపు నుండి (అంటే చంద్రుడి వైపు నుండి) కుడి వైపునకు 9 ప్రదక్షిణలు చేయాలి. |
ఎప్పుడుపడితే అప్పుడు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదు. శుచిగా స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు ధరించినప్పుడు మాత్రమే నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి. |
చాలా మంది ప్రదక్షిణలు చేస్తూ నవగ్రహాలను ముట్టుకుని మరీ
నమస్కారాలు చేస్తుంటారు. కానీ అది తప్పు. విగ్రహాలను తాకకుండానే ప్రదక్షిణలు చేయాలి. దీక్ష తీసుకున్నవారుగానీ, ముఖ్యమైన పూజలు నిర్వహించేవారు గానీ అభ్యంగన స్నానం చేసి మడి దుస్తులు ధరిస్తే అప్పుడు విగ్రహాలు తాకవచ్చు. |
ప్రార్థనలు చేస్తున్నంత సేపూ నవగ్రహ స్తోత్రాలు చదవాలి. 9 గ్రహాలకూ
స్తుతిస్తూ శ్లోకాలు చదివి 9 ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత ప్రత్యేకంగా రాహు,
కేతువులకు మరో రెండు ప్రదక్షిణలు (అంటే మొత్తం 11) చేస్తే చాలా మంచిదంటారు.
అసురులైన రాహుకేతువులను ఈ విధంగా సంతృప్తిపర్చడం వల్ల వారి కారణంగా ఆటంకాలు వుండవని నమ్మకం. |