మీ అదృష్ట సంఖ్యను తెలుసుకోండి
Know Your Lucky Number
ఒక్కోసారి ఎంత కష్టపడి పని చేసినా ఫలితం దక్కదు. అలాంటప్పుడు ఉసూరుమని ''అదృష్టం లేదు'' అని బాధపడుతూ నిట్టూర్పులు విడుస్తాం. ''కృషితో నాస్తి దుర్భిక్షం'' అన్నారు. నిజమే. అనుకున్న దానికోసం పట్టుదలతో పనిచేస్తే దాన్ని సాధించగల్గుతాం. కానీ, కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా ఆశించినది చేతికి అందకుంటే నిరాశ కలుగుతుంది. ''గాల్లో దీపం పెట్టి దేవుడా నీ మహిమ'' అనకూడదు. కానీ నిజాయితీగా శ్రమించినా ఫలితం లేకుంటే అది అదృష్ట లోపం. మరి ఈ అదృష్టాన్ని ఎలా కనిపెట్టాలి.. అదృష్టంతో విజయాన్ని ఎలా చేజిక్కుంచుకోవాలి.. అందుకు దానికి చాలా తేలికైన మార్గం ఉంది.
మీ నక్షత్రం ఏమిటో తెలిస్తే ఇక మీకు కలిసొచ్చే వారాలు, నంబర్లు ఇట్టే తెలుసుకోవచ్చు.
నక్షత్రం అదృష్ట వారాలు అదృష్ట సంఖ్య
అశ్వని ఆది, మంగళ, గురు, శని 7, 8
భరణి గురు, ఆది 6, 9
కృత్తిక బుధ, శుక్ర, శని 1, 9, 6
రోహిణి గురువారం తప్ప తక్కిన అన్నీ 2, 6
మృగశిర ఆది, సోమ, బుధ, శుక్ర 9, 6, 5
ఆరుద్ర సోమ, శుక్ర 4, 5
పునర్వసు ఆది, గురు, శని 2, 3, 5
పుష్యమి శుక్రవారం తప్ప అన్నీ 2, 8
ఆశ్లేష సోమ, మంగళ, గురు, శని 2, 5
మఖ శని, మంగళ 1, 7
పుబ్బ ఆది, సోమ, శుక్ర 1, 6
ఉత్తర శనివారం తప్ప అన్నీ 1, 5
హస్త ఆది, సోమ, మంగళ, బుధ, శుక్ర 2, 5
చిత్త ఆది, బుధ 5, 6, 9
స్వాతి సోమ, మంగళ, శని 4, 6
విశాఖ ఆదివారం తప్ప అన్నీ 3, 6, 9
అనూరాధ సోమ, బుధ, గురు, శని 8, 9
జ్యేష్ఠ సోమ, గురు 5, 9
మూల ఆది, మంగళ, బుధ 3, 7
పూర్వాషాఢ సోమవారం తప్ప అన్నీ 3, 6
ఉత్తరాషాఢ ఆది, మంగళ, గురు, శుక్ర 1, 3, 8
శ్రవణం సోమ, బుధ, గురు 2, 8
ధనిష్ఠ మంగళవారం తప్ప అన్నీ 8, 9
శతభిషం సోమ, బుధ, శుక్ర, శని 4, 8
పూర్వాభాద్ర బుధ, శని 3, 8
ఉత్తరాభాద్ర మంగళ, గురు, శుక్ర 3, 8
రేవతి బుధవారం తప్ప అన్నీ 3, 5
lucky days and numbers brings success, lucky days and numbers brings prosperity, Know your Lucky number and days, Success with lucky numbers