పిత్తాశయం లోపలి రాళ్ళు సమస్య ?



పిత్తాశయంలో రాళ్ల సమస్యకు పరిష్కారం

ఆయుర్వేదంలో గాల్‌స్టోన్స్‌ను పిత్తాశ్మరీ అంటారు. ప్రకోపించిన వాతం పిత్తాశయాన్ని చేరి పైత్యరసాన్ని ఎండింపజేస్తుంది. పిత్తం తన యొక్క పాక గుణంతో దీన్ని ఒక రాయిలా తయారు చేస్తుంది. దీన్ని ఆయుర్వేదంలో పిత్తాశ్మరి అని ఆంటారు. ఆయుర్వేదంలో వాతాది దోషాల ఆధారంగా చికిత్స చేయడం ద్వారా గాల్‌స్టోన్స్‌ను తగ్గించవచ్చంటున్నారు ఆయుర్వేద వైద్యనిపుణులు డాక్టర్‌ మనోహర్‌.
పైత్యరసంలో ఎక్కువగా కొలెసా్ట్రల్‌ చేరినపుడు అది పిత్తాశయంలో పేరుకొని కొలెసా్ట్రల్‌ స్టోన్‌గా మారుతుంది. కాలేయంలోని చనిపోయిన ఎర్ర రక్తకణాలు నాశనం చేసేటపుడు హీమోలైసిస్‌ అనే వ్యర్థ పదార్థం విడుదలవుతుంది. ఇది ఎక్కువగా పోగై పిత్తాశయం చేరుకున్నపుడు పిగ్మెంటెడ్‌ స్టోన్స్‌ ఏర్పడతాయి. 

కారణాలు : అధికంగా కొవ్వు పదార్థాలు, పాల పదార్థాలు తీసుకునే వారికి గాల్‌స్టోన్స్‌ వస్తాయి. స్థూలకాయుల్లో గాల్‌స్టోన్స్‌ రావచ్చు. సీ్త్ర హార్మోన్లు ఉన్న మందులు ఎక్కువగా వాడేవారు, పలుమార్లు గర్భం దాల్చిన సీ్త్రలలో పిత్తాశయం వ్యాధులు రావచ్చు. వంశపారంపర్యంగా పిత్తాశ్మరీ రావచ్చు. 

లక్షణాలు : ఈ పిత్తాశ్మరీ పిత్తాశయ నాళంలో అడ్డుపడినపుడు కుడివైపు పక్కటెముకల కిందిభాగంలో విపరీతమైన నొప్పి వస్తుంది. ఈ నొప్పి కొన్నిసార్లు వీపు భాగంలో వస్తుంది. నొప్పి హఠాత్తుగా మొదలై కొన్ని నిముషాల నుంచి, కొన్ని గంటల వరకు వస్తుంది. వాంతి వచ్చినట్లు ఉండటం, వాంతి రావటం, కడుపు ఉబ్బరం అనే లక్షణాలు కనిపిస్తాయి. ఈ రాయి పిత్తాశయ నాళంలో అడ్డుపడినపుడు కామెర్లు వచ్చే అవకాశం ఉంది. పిత్తాశయంలోనే రాయి స్థిరంగా ఉంటే ఏ లక్షణాలు కనిపించవు. 

నిర్ధారణ పరీక్షలు : ఎక్స్‌రే ప్లెయిన్‌ అబ్డామిన్‌, రక్తపరీక్ష, అలా్ట్రసోనోగ్రఫీ- అబ్డామిన్‌ ద్వారా నిర్ధారిస్తారు. ఎండోస్కోపిక్‌ రిట్రోగ్రేడ్‌ కొలాంజియో పాంక్రియాటోగ్రఫీ అనే నూతన పద్ధతి ద్వారా రాయి పరిమాణం, అది ఉన్న ప్రాంతాన్ని ఖచ్చితంగా గుర్తించవచ్చు. 

శస్త్రచికిత్స ఒక్కటే మార్గమా? 
గాల్‌స్టోన్‌ వల్ల ఇబ్బంది ఎక్కువగా ఉన్నపుడు లితోట్రిప్సీ అనే సర్జికల్‌ పద్ధతి ద్వారా తీసివేయడం లేదా పిత్తాశయాన్ని పూర్తిగా తొలగిస్తారు. ఇలా పిత్తాశయం తీసివేసిన వాళ్లలో అరుగుదల మందగించడం, కడుపు ఉబ్బరం, విరేచనాలు ఎక్కువ అవడం, కామెర్లు, జ్వరం వంటి లక్షణాలు వస్తుంటాయి. కాబట్టి శస్త్రచికిత్స చేయించుకునే ముందు అన్ని విషయాలు జాగ్రత్తగా ఆలోచించుకొని సరైన నిర్ణయం తీసుకోవాలి. 

ఆయుర్వేద చికిత్స : ఆయుర్వేదంలో వాతాదిదోషాల ఆధారంగా చికిత్స చేయడం ద్వారా గాల్‌స్టోన్స్‌ను తగ్గించవచ్చు. శరీరంలో దోష సామ్యతను కలిగించడం ద్వారా గాల్‌స్టోన్స్‌ మళ్లీ తయారు కాకుండా నివారించవచ్చు. గోమూత్ర హరీతకీ, కోకిలాక్ష క్షార, కటుక రోహిణీ, భృంగరాజు, శూలవర్జినివటి, ఆరోగ్యవర్ధినివటి, గడూచీ లాంటి ఔషధాలను అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యుల సలహా మేరకు వాడితే పిత్తాశ్మరీ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది.