కిడ్నీ రాళ్ళను నివారించాలేమా
| |
కిడ్నీలు దెబ్బ తినడానికి అధిక రక్తపోటు, మధుమేహం వంటి కారణాలు ఉంటే, కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి వేరే కారణాలు ఉంటాయి. వాటిలో అధిక భాగం జీవన శైలి లోపాలతో వచ్చేవే. ఆహార పానీయాలు తదితర జీవనశైలి విషయాల్లో జాగ్రత్త పడితే కిడ్నీలో రాళ్లు ఏర్పడే పరిస్థితిని చాలా వరకు అరికట్టవచ్చు. కొందరిలో రాళ్లు ఏర్పడటమూ వాటంత అవే మూత్రం ద్వారా బయటికి వెళ్లిపోవడమూ జరగవచ్చు. అలా వెళ్లిపోకుండా ఉండిపోతేనే ఏదైనా సమస్య మొదలవుతుంది. నేటి ఉరుకు పరుగుల జీవితాల్లో చాలామంది సరిపడా నీళ్లు కూడా తాగలేకపోతున్నారు. ఫలితంగా ఈ కిడ్నీ రాళ్లతో సతమతమయ్యే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. సమస్య ప్రాథమిక దశలోనే ఉంటే వైద్యులైనా జీవన శైలి మార్పులే చెబుతారు. పరిస్థితి చేయిదాటితే మందులు లేదంటే సర్జరీ దాకా వెళ్లాల్సి రావచ్చు. ఆదినుంచే అవసరమైన కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అసలా పరిస్థితే రాదు. ఇంతకీ ఏమిటా జాగ్రత్తలు అంటే..
ఫ నీళ్లు అతి తక్కువగా తాగే అలవాటు కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి గల ఒక ప్రధాన కారణం. శరీరంలో నీటి శాతం తగ్గేకొద్దీ రాళ్లు ఏర్పడే పరిస్థితులు ఎక్కువవుతాయి. నీరు గానీ, ఇతర ద్రవ పదార్థాలు గానీ, మొత్తంగా కలిపితే రోజుకు 4 లీటర్లకు తగ్గకుండా తీసుకోవాలి. కాకపోతే చక్కెర కలిసిన ద్రవాలేవీ తీసుకోకూడదు. ఫ మనం తీసుకునే ఆహారం ద్వారా మనకు అందే కాల్షియం రోజుకు 1200 మి. గ్రాములకు మించి ఉండకూడదు. అంతకన్నా తగ్గకూడదు కూడా. కిడ్నీ తన విధుల్ని సక్రమంగా నిర్వహించడానికి కాల్షియం కూడా అవసరమే. అందుకు కొవ్వు బాగా తక్కువగా ఉన్నవి లేదా కొవ్వు అసలే లేని పాల ఉత్పత్తులు తీసుకోవచ్చు. వీటిలో మజ్జిగ ఎక్కువ శ్రేయస్కరం. ఫ కిడ్నీలో అప్పటికే ఆక్సెలేట్ రాళ్లు ఉంటే, ఆక్సెలేట్ ఉండే పదార్థాలు అంటే చాక్‌లేట్, పాలకూర, సోయా, ఎండు చిక్కుడు ధాన్యాల్లాంటివి తీసుకోకూడదు. ఫ సి-విటమిన్ ఉన్న పదార్థాలు చాలా పరిమితంగా తీసుకోవడమే ఉత్తమం. ఎందుకంటే సి- విటమిన్ ఎక్కువగా తీసుకుంటే అది రాళ్లుగా మారే ప్రమాదం ఉంది. అందుకే సిట్రస్ తక్కువగా ఉండే పండ్లే తీసుకోవాలి. ఫ శరీరానికి సోడియం చాలా అవసరం. అయితే, రోజుకు 2,300 మి. గ్రాములకు మించకుండా తీసుకోవాలి. ప్రాసెస్ చేసిన మాంసం గానీ, ప్రాసెస్ చేసిన ఏ ఆహార పదార్థమైనా తీసుకోకూడదు. ఫ స్థూలకాయం కూడా కొందరిలో కిడ్నీలో రాళ్లు ఏర్పడేందుకు కారణమవుతుంది. శరీరంలోని జీవక్రియలన్నీ కుంటుపడ్డాయని చెప్పే సంకేతమే స్థూలకాయం. ఈ స్థితిలో ఇతర జీవక్రియలతో పాటు, కిడ్నీ జీవక్రియలు సైతం కుంటుపడతాయి. ఫలితంగా కిడ్నీ సరిగ్గా పనిచేయకపోవడంతో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. ఏమైనా ఆహారపానీయాల విషయాల్లో నిర్దిష్టతను పాటించడం ఒక్కటే కిడ్నీ రాళ్లనుంచి విముక్తి పొందడానికి ఉన్న చ క్కని మార్గం. |
మూత్రపిండాల్లో రాళ్లు పోయేదెలా?