వైకుంఠ ఏకాదశి -జాగరణమహాత్యం




ఈ రోజు విష్ణువు మేల్కొంటాడు. సూర్యుడు ఉత్తరాయణంలో సమీపిస్తాడన్నమాట.
కనుక మోక్షైకాదశి అని కూడా ఈ పవిత్ర దినానికి పేరు. కృతయుగంలో 'ముర' అనే
రక్కసుడు దేవతలను, సాధువులను క్రూరంగా హింసించేవాడు, దేవతలు
 శ్రీమన్నారాయణునితో మొరపెట్టుకోగా భగవంతుడు వైకుంఠం నుండి భూలోకానికి
వచ్చి మురాసురుణ్ణి సంహరించాడు.

ఈ సంహరం ఏకాదశినాడు జరిగింది. విష్ణువు వైకుంఠం నుండి భూలోకానికి వచ్చి
శత్రువులను సహరించిన రోజునే వైకుంఠ ఏకాదశిగా పిలుస్తున్నాము. 

వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. ఏకాదశి తిధులలో పదకొండవది.
 తిది ఏకాదశులలో హరినామకీర్తనం ప్రధానం కాబట్టి దీనికి హరి వాసరమనే పేరు
 కూడా వచ్చింది. సౌరమానం ప్రకారం జరిపే పండుగ ఏకాదశి.

దేవతలు బ్రహ్మతో సహ వైకుంఠం వెళ్లి ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారా యణుని
దర్శించి తమ బాధలను విన్నవించుకొని స్వామి అనుగ్రహం పొందారు. ఉత్తర ద్వారం
ద్వారా వెళ్లి వైకుంట దర్శనం చేసుకోవటం వల్ల వైకుంట ఏకాదశిగాను మూడుకోట్ల
దేవతలతో ఈ రోజు భూలోకానికి వచ్చాడు కాబట్టి ముక్కోటి ఏకాదశిగా
ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది.

పంచాంగ కర్తలు దీన్నే హరివాసరమనీ, వైకుంఠ దినమనీ, హరాదినమని
అంటారు. ధనుర్మాసంలో వచ్చే ఏకాదశే సంవత్సరంలోని ఇరవై నాలుగు
ఏకాదశులలో శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఆషాఢ శుద్ధ ఏకాదశి
 ప్రధమైకాదశి. దీనికి మరో పేరు శయనైకాదశి. విష్ణువు శేషతల్పంపై శయనిస్తాడు.
 దక్షిణాయనం ప్రారంభమవు తుంది.

 కాబట్టి సూర్యుడు దక్షిణానికి కనిపిస్తాడు. ఆషాఢ బహుళైకాదశి కామికా కాదశి,
 శ్రావణ శుద్తేకాదశి, పుత్రైకా దశి:, బహుళ కాదశి, అజైకాదశి బాద్రపదంలో
వరిహ్తనైకాదశి మొదటిది. ఈ రోజు విష్ణువు పక్కకు తిరుగుతాడు. ఇంద్రైకాదశి
ఆశ్వయు జంలో కార్తీకంలో మొదటిది ప్రబోదినైయ కాదశి. దీన్నే ఉతౌదనైకాదశి అంటారు.
ఈ సంహరం ఏకాదశినాడు జరిగింది. విష్ణువు వైకుంఠం నుండి భూలోకానికి వచ్చి
శత్రువులను సహరించిన రోజునే వైకుంఠ ఏకాదశిగా పిలుస్తున్నారు. ఈ పర్వదినం
స్వర్గద్వారం, ముక్కోటేకాదశి, వైకుంఠ ఏకాదశని నామాలతో వ్యవహ రించబడుతూ
 ఈ రోజున దేవాలయాలలో ఉత్తర ద్వారదర్శనంతో శ్రీమహావిష్ణువును దర్శించిన వారికి
పు నర్జన్మలేదని శాస్త్రం చెపుతు న్నది. శ్రీవైష్ణవా ళ్వారులలో ఒకరైన నమ్మాళ్వారు
 ఈనాడు పరమదించ డం వల్ల కూడా విష్ణువులు దీనికి విశేష ప్రాధాన్యత ఇస్తారు.
 తిరుమలలో ప్రాత:కాలం నుండి ప్రత్యేక ఉత్తర ద్వార దర్శనం కలుగుతుంది.
దీన్నే వైకుంట ద్వారం తెరవడం ఆచా రంగా మారింది. దక్షిణా యణంలో
మరణించిన పుణ్యాత్ములు వైకుంఠ ద్వారం తెరచినప్పుడు స్వర్గంలోకి దానిగుండా
ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నాయి.

ఏకాదశి జాగరణ మహాత్యం
కలియుగంలో ఎవరైతే ఏకాదశి రాత్రి జాగరణ సమయంలో వైష్ణవ శాస్త్రాన్ని పఠిస్తారో కోటి
జన్మలలో చేసిన వారి నాలుగు విధాలైన పాపాలు నశించిపోతాయి. ఏకాదశి తిధినాడు
భక్తులు గీతశాస్త్ర వఠనంతో ఎవరైతే జాగరణ చేస్తారో వారు యమపాశం నుండి
ముక్తులవుతారు. అంతేకాదు ఏకాదశి వ్రతం ఆచరిస్తారో వారు నాకు సదా ప్రియులై ఉంటారు.

వర్ధినీ జాగరణ చేసినవారు రాబోయే జన్మలో ఏర్పడే శరీరాన్ని భస్మంచేసిన వారుగాను, 
'త్రిస్పృశా' జాగరణ చేసినవారు విష్ణు భగవానుని రూపంలో లీనమగుట, 'బోధిని'
 జాగరణ చేసినవారికి అన్ని పాపాలు నశించిపోవుట జరుగుతాయి.

య: పున: పఠతే రాత్రేగాతాం నామ సహస్రకమ్‌!
ద్వాదశ్యాం పురతే విష్ణోనానామం నమావత:!
నగచ్ఛేన్తరమ స్థాన యంత్ర నారాయణ: త్వయమ్‌!!

ఏకాదశి నాటి రాత్రి గీతాపఠనం, విష్ణుసహస్రనామం పారాయణం చేసిన వారు విష్ణు
ధామమును చేరుకుంటారు. రామ చరితను చదువువారు యోగ్యవంతులౌతారు.

ఏకాదశి నియమాలు
మౌనం, జప, శాస్త్ర పఠనం, కీర్తనం, రాత్రిజాగరణ ఏకాదశి వ్రతాలలో విశేషలాభాలను
 పొందుతారు. భోజనం రెండు సార్లు నిషేధం. బ్రహ్మచర్యం పాఠించి భోగవస్తువులకు
 దూరంగా ఉండాలి. పండ్లు పాలు తాగుట వల్ల మంచి ఫలితం లభిస్తుంది.

ఏకాదశి రోజున సత్యాన్నే మాట్లాడాలి. ద్వాదశి నాడు ఆకలితో ఉన్నవారికి మృష్టాన్నం
దక్షిణ ఇచ్చి సంతోషపరచాలి.ముక్కోటినాడు గీతాపారాయణం, గోవిందనామ స్మరణ
మోక్షప్రాప్తిని కలిగిస్తాయి. ద్వాదశి నాడు బ్రహ్మాణులకు దక్షిణ తాంబూలాదులతో
 సత్కరించినవారికి మరో జన్మంటూ ఉండదని భక్తుల విశ్వాసం.