ఎక్కువ సేపు ఒకటే చోట కూర్చొని పనిచేసేవారికి పొట్ట తగ్గించడానికి వ్యాయామాలు ?


  ఎక్కువ సేపు ఒకటే చోట కూర్చొని పనిచేసేవారికి సాధారణంగా పొట్ట ఎక్కువగా 
ఉంటుంది. ఒక చిన్న వ్యాయామంతో పొట్టను తగ్గించుకోవచ్చు. ఈ వ్యాయామాలు
 పొట్టను తగ్గించడానికి ఎంతో ఉపయోగపడతాయి. అవి ఏమిటంటే:

మొదటి వ్యాయామం: నేల మీద వెల్లకిలా పడుకొని కాళ్ళు, చేతులు నిటారుగా నేలకు
 ఆనించాలి. తర్వాత రెండు కాళ్ళనూ కొద్ది అడుగులు పైకి లేపాలి. అలా 10 అంకెలు 
లెక్కపెట్టే వరకు ఉండండి. తర్వాత నెమ్మదిగా కాళ్ళను కిందికి దించాలి. ఇదే విధంగా 
మూడు, నాలుగు సార్లు చేయాలి. ఇలా కాళ్ళను పైకి లేపి ఉంచడం వల్ల పొట్టపై ఒత్తిడి
 పెరుగుతుంది. అలా కౌంటింగ్‌ను పెంచుకుంటూ ప్రతిరోజూ చేస్తుంటే పొట్ట తగ్గడం ఖాయం.

రెండో వ్యాయామం: నేల మీద పడుకొని, పాదాలు నేలకు ఆనే విధంగా కాళ్ళను 
ముడుచుకోవాలి. చేతులను మెడను పైకి నెడుతున్నట్లుగా అదిమినట్లు ఉంచి, 
శరీరభాగాన్ని సగం కూర్చున్నట్లుగా పైకి లేపాలి. 

కొద్దిసేపు అలాగే ఉండి తర్వాత శరీరాన్ని దించాలి. ఇలా మూడు, నాలుగు సార్లు 
చేయడం వల్ల కూడా పొట్టను తగ్గించవచ్చు.