ప‌గ‌లు యాక్టింగ్ -- నైట్ డేటింగ్‌, ఈ హీరొయిన్ బిజీబిజీ !



yami gautam కోసం చిత్ర ఫలితం


నటి యామి గౌతమ్ త‌న తోటి హీరోతో ల‌వ్‌లో ప‌డి డేటింగ్ చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ ఉత్తరాది భామ మెగా ఫ్యామిలీ హీరో అల్లు శిరీష్ న‌టించిన గౌరవం చిత్రం ద్వారా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. అంతకుముందు విక్కిడోనర్ చిత్రంతో బాలీవుడ్‌లో మెరిసింది. ప్రస్తుతం తమిళంలో తమిళ్ సెల్వం, తనియార్ అంజలుమ్ చిత్ర విడుదల కోసం ఎదురుచూస్తున్న యామిగౌతమ్ హిందీ సనందే అనే చిత్రంలో బుల్‌గిట్ సామ్రాట్ తో కలిసి నటిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ టైంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింద‌ని…ప‌గ‌లు షూటింగ్‌లో బిజీగా గ‌డుపుతున్న వీరు రాత్ర‌యితే  డేటింగ్‌లో మునిగితేలుతున్నార‌ని బాలీవుడ్ మీడియాలో జోరుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.