డోర్ నెక్ట్స్ గర్ల్.. ఇమేజ్‌తో హీరోయిన్‌గా తొలి అడుగులు వేసింది అంజలి. అటు కోలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ పెర్‌ఫార్మెన్స్ తెలిసిన యాక్ట్రస్‌గా పేరు తెచ్చుకున్న అంజలి డ్రెస్సింగ్ విషయంలో కేర్‌ఫుల్‌గా ఉంటుందనే బ్రాండ్ ఉండేది. అయితే అదంతా గతంలోని తంతే. తానూ ఎక్స్‌పోజింగ్ మెటీరియల్‌నని ఫ్రూవ్ చేసుకోవడానికి ఈ రాజోలు పిల్ల గ్లామర్ సాక్షిగా కష్టపడుతోందని కోలీవుడ్ కోడై కూస్తోంది.
తమిళంలో మంచి క్రేజున్న యువ కథానాయకుడు 'జయం' రవి పక్కన 'అప్పతక్కర్' అనే సినిమాలో అంజలి ఓ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో ముదురు భామ త్రిష మరో హీరోయిన్. ఎక్స్‌పోజింగ్‌కి ఏ మాత్రం వెనుకాడని త్రిషకి తగ్గకుండా ఉండేందుకు అంజలి పాప సైతం గ్లామరసాన్ని అంతకు మించి ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తోందని తమిళతంబీలు చెవులు కొరుక్కుంటున్నారు. మొత్తమ్మీద అంజలి శ్రుతి మించుతోందన్నమాట. మరి ఈ వైనం ఏవైపుకి దారి తీస్తుందో చూడాలి