ప్రస్తుతం టాలవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాక్స్ మారిన బ్యూటీ యాంకర్ రష్మీ. అవును. టాలీవుడ్ లో వరుస చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన యాంకర్ రష్మి, అప్ కమింగ్ మూవీలలో వెరీ హాట్ గా కనిపించనుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, 'చందమామ కథలు' చిత్రంతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'గుంటూరు టాకీసు'. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ లాంఛ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.
దర్శకుడు ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ చందమామ కథలు తర్వాత నేను చేస్తున్న సినిమా ఇదన్నారు. గుంటూరు పట్టణంలో జరిగే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, అందుకే దీనికి ఈ టైటిల్ పెట్టామని, పూర్తిస్థాయి కామెడీ చిత్రమిదని అన్నారు. ఇందులో నాలుగు పాటలున్నాయని, ఇప్పటికే షూటింగ్ జరుగుతోందని అన్నారు. ఇప్పటికే టాకీని పూర్తిచేసుకున్న ఈ సినిమా, త్వరలోనే పాటల చిత్రీకరణకోసం బ్యాంకాక్‌కు వెళుతుంది.
రష్మి మాట్లాడుతూ టీవి యాంకర్‌గా చేస్తున్న తనకు ఈ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం కల్పించిన ప్రవీణ్, ప్రొడ్యూసర్ ఆర్.కెలకు థ్యాంక్స్ అన్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీలో రష్మి బికినిలో కనపడే ఛాన్స్ ఉందని అంటున్నారు. కథా పరంగా ఓ పాటకు సంబంధించిన సీన్ లో రష్మి వెరీ హాట్ లుక్స్ తో, బికిని లో కనిపడుతుందని క్లియర్ టాక్స్ వినిపిస్తున్నాయి