అత్తతో గొడవ పడిన ఐశ్వర్యారాయ్..?

aishwarya rai కోసం చిత్ర ఫలితం

అత్త ఎప్పటికీ అమ్మ కాలేదు.. అనేది నానుడి ఎప్పటి నుండో వింటూనే ఉంటున్నాం. కాని ఈ మధ్య కాలంలో వచ్చిన మార్పుల వల్ల అత్తలు కూడ అమ్మల్లాగే ప్రేమని పంచుతున్నారు. కానీ, ఎక్కువ శాతం అత్తలు, అత్తలుగా చెలామాణి అవతున్నారు. అయితే ఇటువంటి పరిస్థితులే సెలబ్రిటీల ఇళ్ళల్లోనూ ఉంటాయా? అంటే...అవుననే సమాధానం వస్తుంది 

తాజాగా బిటౌన్ లో జరిగిన ఓ సెలబ్రిటి విషయాన్ని చూస్తే. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, అభిషేక్ బచ్చన్ ను పెళ్లి చేసుకుని బిగ్ బి ఇంటి కోడలిగా ఐశ్వర్యారాయ్ సెటిలైపోయింది. అభిషేక్ ని ప్రేమించి పెళ్లాడిన ఈ మాజీ ప్రపంచ సుందరి... తల్లి అయిన తరువాత కొన్నేళ్ల పాటు నటనకు గుడ్ బై కూడా చెప్పేసింది. రీసెంట్ గా మళ్లీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చేందుaకు రెడీ అయిన ఈ స్టార్ హీరోయిన్, త్వరలోనే జస్బా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. 

అయితే తన ఫిల్మ్ కెరీర్ కి సంబంధించిన విషయాలు కాసేపు పక్కన ప డితే, ఆమెకు... అత్తగారు అయిన జయా బచ్చన్ కు అస్సలు పడటం లేదని కొన్ని నెలల క్రితం నుంచే ప్రచారం సాగుతోంది. అత్త నుంచి దూరంగా ఉండేందుకే ఐశ్వర్యారాయ్, అభిషేక్ తో రూ. 21 కోట్ల ఖరీదైన ఫ్లాట్ కొనించుకుందనే టాక్ కూడాఉంది. 

అంతే కాకుండా కొత్త ఫ్లాట్ కు షిఫ్ట్ అయిన ఐశ్వర్యరాయ్, అత్త అయిన జయాబచ్చన్ ఇంటికి రావడం దాదాపు మానివేసిందనే క్లియర్ టాక్స్ బిటౌన్ లో వినిపిస్తున్నాయి. బిగ్ బి ఫ్యామిలీకి సన్నిహితంగా ఉండే వారు, అత్త పోరు పడలేక వేరు కాపురం పెట్టిన మాజీ ప్రపంచ సుందరిగా చెబుతున్నారు.