రాహుల్ గాంధీ డ్రగ్స్ తో పట్టుబడ్డాడు...!

raahul gaandhi drags to pattubaddaadu.. subrahmanya

లలిత్ మోదీ వ్యవహారంపై భారతీయ జనతా పార్టీపై కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. లలిత్ మోదీ విదేశీ వ్యవహారంతో సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజేకి సంబంధం ఉన్న నేపథ్యంలో ఇద్దరి పై చర్యలు తీసుకోవాలని వివాదం చేస్తుంది. 

ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ లలిత్ మోడీ వివాదంలో విమర్శలు చేస్తున్ననేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి స్పందించి వారికి ఘాటుగా సమాధానమిచ్చారు.

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీని విమర్శించే ముందు కాంగ్రెస్ పార్టీ మొదట తమ గురించి చూసుకోవాలని విమర్శించారు. అంతేకాక గతంలో రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో డ్రగ్స్ తో ఉండగా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బిఐ) అధికారులు పట్టుకున్నారని ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టారు. 

అప్పుడు సోనియాగాంధీ అప్పట్లో ప్రధానమంత్రిగా ఉన్న అటల్ బిహారీ వాజ్ పేయ్ ను వేడుకోవడంతో ఆయన కల్పించుకొని నాటి అమెరికా అధ్యక్షులు జార్జ్ బుష్‌కు స్వయంగా ఫోన్ చేసి రాహుల్ ను విడిపించారని షాకింగ్ ఆరోపణ చేశారు.