పిల్లి మొగుడు చనిపోయాడని, కుక్క ను మొగుడిగా చేసుకుంది (పెళ్లి వీడియో)

CAT DIES DOG MARRIAGE కోసం చిత్ర ఫలితం
చాలా మంది తమ పెంపుడు జంతువులను కుటుంబసభ్యుల్లా చూసుకుంటారు. ఇందులో వింతేమీ లేదు. కానీ, ఓ మహిళ మాత్రం తను అమితంగా ప్రేమించే ఓ పిల్లిని పెళ్లి చేసుకుంది. కొంత కాలం తర్వాత ఆ పిల్లి చనిపోవడంతో ఆమెకు మరో పెంపుడు జంతువుపై ప్రేమ పుట్టింది. దీంతో ఈసారి తన పెంపుడు కుక్కతో ఆమె వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ ఘటన నెదర్లాండ్ దేశంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే. నెదర్లాండ్స్‌కి చెందిన డొమినిక్‌ అనే మహిళ ఎనిమిదేళ్ల క్రితం తాను పెంచుకుంటున్న పిల్లి(డొరేక్‌)ని పెళ్లి చేసుకుంది. ఇటీవల డొరేక్‌ అనారోగ్యంతో చనిపోయింది. దీంతో డొమినిక్‌ తీవ్ర మనస్తాపానికి గురైంది.
ఇప్పుడు ఆ బాధని మరిచిపోవడానికి ట్రావిస్‌ అనే పెంపుడు కుక్కని పెళ్లాడాలనుకుంటోంది. పెంపుడు జంతువులను ఆమె పెళ్లి చేసుకోవడమే కాక, ఇతరులనూ ప్రోత్సహించడం గమనార్హం. అంతేగాక, ఆమె ఓ వెబ్‌సైట్‌ని కూడా ప్రారంభించింది.
ఎవరైనా తమ పెంపుడు జంతువుల వివరాలను పంపిస్తే తానే వర్చువల్‌ వివాహం జరిపిస్తానని, దానికి చట్టబద్దత కల్పిస్తామని చెబుతోంది. అయితే కొందరు చిరుత, సింహాలను కూడా పెంచుకుంటుంటారని అలాంటి క్రూర జంతువులతో వివాహానికి మాత్రం తాను అంగీకరించనని ఆమె తేల్చిచెప్పింది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : CLICK HERE