ఆ హీరో రేష్మిని పెళ్ళిచేసుకుంటాడట...!


Bobby_shima

రేష్మి అనగానే అందరికి గుర్తొచ్చేది జబర్దస్త్ రేష్మినే. అంత పాపులర్ అయింది జబర్దస్త్ రేష్మి. కానీ ఈ వార్త మాత్రం ఆ రేష్మి గురించి కాదు. ఈ వార్త హీరోయిన్ రేష్మి మీనన్ కు సంబందించింది. హీరోయిన్ రేష్మి మీనన్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు తమిళ హీరో బాబీ సింహ. వీరిద్దరూ జంటగా ఉరుమీన్ అనే తమిళ సినిమాలో నటించారు.

కాగా ఆ సినిమాలో నటిస్తున్న సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో పెళ్లి చేసుకోవడానికి సిద్దమయ్యారు. పెద్దలు ఒపుకుంటే అందరి సమక్షంలో పెళ్లి లేదా తిరుపతి వెళ్లి అక్కడ గుడిలో పెళ్లి చేసుకుందామని ప్రయత్నాలు చేస్తున్నారట ఈ జంట. బాబీ సింహ జిగర్ తండా లో ప్రదర్శించిన అద్భుత నటనకు గాను కేంద్ర ప్రభుత్వ అవార్డు అందుకొని సంచలనం సృష్టించాడు.